రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులు మూసేయాలి: కేంద్రం ఆదేశం

దేశంలో లాక్ డౌన్ విధించినా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు… రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేవలం నిత్యావసర సరుకుల రవాణాకు మాత్రమే అనుమతించాలని సూచించింది.

నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణాలు చేస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది కేంద్రం. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పూర్తి బాధ్యత తీసుకోవాలని తెలిపింది. నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు లేకుండా చూడాలని, ఇప్పటికే సరిహద్దు దాటిన వాళ్లను 14 రోజులు క్వారంటైన్ లో ఉంచాలని సూచించింది. విద్యార్థులు, కార్మికులను ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తే చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

Latest Updates