TRS ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది బీజేపీ. జగిత్యాల జిల్లాలో నిరసన తెలిపారు బీజేపీ నాయకులు. రాయికల్ మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలో కెేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. సీఎం వేంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలని సత్తుపల్లి మండలం,పట్టణం పార్టీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సత్తుపల్లి రింగ్ రోడ్ కూడలిలో సత్తుపల్లి మండల అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్,పట్టణ ప్రధాన కార్యదర్శి జోన్నల గడ్డ నరేష్ ఆధ్వర్యంలో కేసీఆర్ ఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యామ్ సుందర్, జిల్లా కార్యదర్శి సుదర్శన్ మిశ్రా మాట్లాడుతూ..  కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వివాధ వ్యాఖ్యలు చేశారన్నారు. అయోధ్యలో కడుతున్న రామ మందిరానికి విరాళాలు ఇవ్వొద్దని.. బీజెేపిీ వాళ్ళు బిక్షం ఎత్తుకొంటున్నారని మాట్లాడిన విద్యాసాగర్ అసలు ముందు నువ్వు హిందువేనా అని ప్రశ్నించారు. అయోధ్యలో రామ మందిరం కట్టడం వెనుక ఎందరో మహానుభావులు.. కొన్ని లక్షల మంది బలిదానాలు చేయభట్టే అయోధ్యలో రామ మందిరం కడుతున్నారనీ.. ఇవాళ హిందువుల కల నెరవేరుతుందన్నారు హిందువుగా ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని తెలుసుకోవాలని.. వెంటనే కేసీఆర్ హిందువులకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆచంట నాగస్వామీ, భాస్కర్, sk రహీం తూల్ల, మంద శివ, శ్రీ సాయి,చారీ గారు,బండారు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Latest Updates