తవ్వకాల్లో దొరికిన విగ్రహం: పరిశీలించిన విద్యాశాఖ మంత్రి

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో గుట్టపై ఉన్న బౌద్ధ క్షేత్రాలను శనివారం విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సందర్శించారు. కొన్ని రోజులుగా పురావస్తుశాఖ తవ్వకాలు జరుపుతోంది. శుక్రవారం ఆరు అడుగుల అతి పురాతన గార ప్రతిమ బయటపడింది. దానిని జగదీశ్ రెడ్డి, ఇతర నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పారు.  కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి ఛైర్మన్ నేతి విద్యాసాగర్, తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్ , చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Latest Updates