Stephen Fleming: ఇంగ్లాండ్ పురుషుల టెస్ట్ క్రికెట్లో సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) తమ టెస్ట్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను అధికారికంగా నియమించింది. ఇప్పటి వరకు కోచ్‌గా ఉన్న బ్రెండన్ మెకల్లమ్ స్థానంలో ఫ్లెమింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు, బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించడంతో ఇంగ్లాండ్ టెస్ట్ సారథిగా మరోసారి జో రూట్ ఎంపికయ్యారు.
మెకల్లమ్ స్థానంలో ఫ్లెమింగ్ నియామకం:
ప్రస్తుత కోచ్ బ్రెండన్ మెకల్లమ్ స్థానంలో స్టీఫెన్ ఫ్లెమింగ్ రెడ్ బాల్ (టెస్ట్) జట్టు బాధ్యతలను తీసుకోనున్నాడు. ఈ నియామకంపై ఫ్లెమింగ్ స్పందిస్తూ.. ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కోచింగ్ బాధ్యతలలో ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ పదవి ఒకటి.. ఈ అవకాశాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.. జట్టులోని యువ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీస్తూ, వర్తమాన విజయాలతో పాటు దీర్ఘకాలంలో జట్టును అగ్రస్థానంలో నిలబెట్టడమే నా ప్రధాన లక్ష్యం అని ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా రాసుకొచ్చాడు.
మళ్లీ పగ్గాలు చేపట్టిన జో రూట్:
కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో, ఇంగ్లాండ్ టెస్ట్ పగ్గాలు మళ్లీ జో రూట్ చేతికి వచ్చాయి. 2017 నుంచి 2022 వరకు ఇంగ్లాండ్ టెస్ట్ సారథిగా కొనసాగిన రూట్, 27 విజయాలతో దేశ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా జో రూట్ మాట్లాడుతూ.. మరోసారి టెస్ట్ కెప్టెన్‌గా ఎంపిక కావడం నా అదృష్టం.. అపారమైన అనుభవం ఉన్న ఫ్లెమింగ్‌తో కలిసి పని చేసేందుకు, జట్టుని మళ్లీ గెలుపు బాట పట్టించేందుకు సిద్ధంగా ఉన్నాను అని పేర్కొన్నాడు.
►ALSO READ | కేకేఆర్ కొత్త కెప్టెన్ ఎవరంటే?.. రహానే రిటైర్మెంట్తో రేసులో ముగ్గురు స్టార్ ప్లేయర్లు!
రూట్– ఫ్లెమింగ్ జోడి.. ఈసీబీ కొత్త ఆశలు:
స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు 18 ఏళ్ల పాటు కోచ్‌గా వ్యవహరించి ఏకంగా 5 టైటిళ్లు అందించిన రికార్డు ఆయన సొంతం. అంతేకాకుండా న్యూజిలాండ్ జట్టుకు అత్యధికంగా 80 టెస్టుల్లో కెప్టెన్‌గా ఆడిన అనుభవం ఉంది. ఇంగ్లాండ్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన జో రూట్ అనుభవం, ఫ్లెమింగ్ వ్యూహాలు కలిసి ఇంగ్లాండ్ రెడ్ బాల్ క్రికెట్‌ను మళ్లీ అగ్రస్థానానికి చేరుస్తాయని ఈసీబీ ఆశిస్తుంది.
A word from our new Men's Test Head Coach 💬 pic.twitter.com/bNHZO7plFv
— England Cricket (@englandcricket) July 30, 2026
Welcome back, Captain Rooty! 🫡 pic.twitter.com/4ON5pFmKnu
— England Cricket (@englandcricket) July 30, 2026
