కార్పొరేట్ పన్నును తగ్గించడం చరిత్రాత్మకం: మోడీ

కార్పొరేట్ పన్నును తగ్గిస్తూ ఆర్థికశాఖ తీసుకున్న చరిత్రాత్మకమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశంలోకి ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి ఇదో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దేశంలోని ప్రైవేట్ రంగంలో పోటీతత్వాన్ని పెంచడానికి, ఎక్కువ ఉద్యోగాల కల్పనకు తాజా ఉద్దీపన ఉపకరిస్తుందని ప్రధాని ట్వీట్ చేశారు. భారత్ ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు నరేంద్ర మోడీ.  భారతదేశాన్ని వ్యాపార అనుకూలంగా దేశంగా మార్చడంతో పాటు అన్ని వర్గాలకు ఉపాధి అవకాశాలు లభించేలా కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని ప్రధాని చెప్పారు.

Latest Updates