క‌రోనాతో పోయే ప్రాణాల్ని బ్ర‌తికిస్తున్న స్టెరాయిడ్స్

తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న క‌రోనా రోగులకు మార్కెట్ లో దొరికే కార్టికోస్టెరాయిడ్ డ్రగ్స్‌ను విషమంగా ఉన్న క‌రోనా పేషెంట్లకు ఇవ్వగా.. మరణించే ముప్పు 20 శాతం తగ్గిందని గుర్తించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రచురించిన ఏడు అధ్యయనాల్లో సేక‌రించిన ఫ‌లితాల ఆధారంగా ప్లెసిబో చికిత్స లేదా స్టెరాయిడ్లు మరణ ప్రమాదాన్ని మూడింట ఒక వంతు తగ్గించినట్లు కనుగొన్నారు.

జూన్ నెల‌లో ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ సైంటిస్ట్ లు ప‌రిశోధ‌న‌లు చేశారు. ఈ ప‌రిశోధ‌న‌ల్లో డెక్సామెథాసోన్ అనే స్టెరాయిడ్ ను ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న క‌రోనా రోగుల‌పై ప్ర‌యోగించారు. వారిలో 35% వరకు మ‌ర‌ణాల రేటు త‌గ్గిన‌ట్లు గుర్తించారు.

ఈ స్టెరాయిడ్లు క‌రోనా నార్మాల్ గా ఉన్న రోగుల పై ప్ర‌యోగించ‌డం వ‌ల్ల ఎలాంటి ఫ‌లితాల్ని ఇవ్వ‌లేదని తేలింది.

అయితే ఈ ఫ‌లితంపై లండన్ లో ఇంపీరియల్ కాలేజీకి డాక్టర్ ఆంథోనీ గోర్డాన్ ఇదొక పెద్ద అడుగు, ఫ‌లితాలున్నా, క‌రోనా నివార‌ణ‌కు సాధ్యం కాద‌న్నారు.

Latest Updates