బట్లర్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ : స్మిత్

జైపూర్: మరో మూడు రోజుల్లో IPL ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇండియాకు చేరుకున్న విదేశీ ప్లేయర్లు..ఒకరిపై ఒకరు ప్రశంసలు గుప్పుతున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌ లో ఉన్న విధ్వంసకర బ్యాట్స్‌మెన్లలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కూడా ఒకడని తెలిపాడు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్. బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం ఎదుర్కొన్న స్మిత్.. IPLలో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన స్మిత్.. “బట్లర్‌ తో కలిసి ఆడటం చాలా గౌరవంగా భావిస్తున్నా. అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సులువుగా అనిపిస్తుంది. గ్రౌండ్ లో ఎప్పుడూ చాలా ఉత్సాహంగా ఉంటాడు.

వేగంగా పరుగులు చేయడంలో  స్మిత్ బ్యాటింగ్ స్టైల్ సూపర్బ్” అని తెలిపాడు. అంతకుముందు స్మిత్ రీ ఎంట్రీపై మాట్లాడిన బట్లర్..స్మిత్ పై ప్రశంసలు కురిపించాడు. స్మిత్ మంచి ప్లేయర్ అని కీలక సమయాల్లో ఆచితూచి ఆడుతూ మ్యాచ్ ను విజయంవైపుగా తిప్పే సత్తా స్మిత్ సొంతం అన్నాడు.

Latest Updates