బిల్ బోర్డ్ పై శ్రీరాముడి చిత్ర‌ప‌టాలు..వ‌ద్దంటూ పిటీష‌న్ దాఖ‌లు

బిల్ బోర్డ్ ల‌పై శ్రీరాముడి చిత్రప‌టాల్ని ప్ర‌ద‌ర్శించేందుకు వీల్లేదంటూ ప‌లువురు పిటీష‌న్లు దాఖ‌లు చేశారు.

అయోధ్యలో రేపు జరిగే భూమి పూజ కోసం కోట్లాది మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ప‌ర్వదినాన్ని పుర‌స్క‌రించుకొని ప్ర‌పంచ దేశాల్లోని ప‌లు ప్రాంతాల్లో భ‌క్తులు యాడ్ ఏజెన్సీల ఆధ్వ‌ర్యంలో శ్రీరాముడి చిత్ర‌ప‌టాల్ని ప్ర‌ద‌ర్శన‌కు పెట్ట‌నున్నారు. . అయితే ప‌లువురు చిత్ర‌ప‌టాల్ని ప్ర‌ద‌ర్శించడాన్ని వ్య‌తిరేకిస్తూ పిటిష‌న్లను దాఖ‌లు చేస్తున్నారు.

ఆగష్టు 5 న అయోధ్య భూమి పుజ‌ను పుర‌స్క‌రించుకొని అమెరికాకు చెందిన యాడ్ ఏజెన్సీ సంస్థ బ్రాండెడ్ సిటీస్ రాముడి చిత్ర‌పటాల్ని ప్ర‌దర్శించ‌నుంది. ఆ ప్ర‌ద‌ర్శ‌న‌ను నిర‌సిస్తూ ప‌లువురు పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. అంతేకాదు పిటిష‌న్ దారులు స‌ద‌రు యాడ్ ఏజెన్సీ చిత్ర‌ప‌టాల్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి వీల్లేద‌ని డిమాండ్ చేయ‌డంతో యాడ్ ఏజెన్సీ బ్రాండెడ్ సిటీ రాముడి చిత్ర‌ప‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌ను నిలిపివేసిన‌ట్లు తెలుస్తోంది.

Latest Updates