మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఆపేయండి: హైకోర్టు

రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌లో నిబంధ‌న‌లు పాటించ‌లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై ఇవాళ(సోమ‌వారం) హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. పిటిష‌న‌ర్ త‌ర‌పు లాయర్ కొన్ని అంశాల‌ను లేవ‌నెత్తారు. మొదట రిజర్వేష‌న్లు ప్ర‌క‌టించి నోటిఫికేష‌న్ జారీ చేయాల‌ని…ఆ త‌ర్వాత షెడ్యూల్ ప్ర‌క‌టించాలి ..కానీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఈ నిబంధ‌న‌లేమీ పాటించ‌లేద‌ని  కోర్టుకు  తెలిపారు. వాద‌న‌లు విన్న కోర్టు విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయొద్ద‌ని ఆదేశించింది. తర్వాత  త‌దుప‌రి విచార‌ణ‌ను రేప‌టి (మంగ‌ళ‌వారం)కి వాయిదా వేసింది.

ST,SC,BC మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు చేయ‌కుండానే జ‌న‌వ‌రి 7 నుంచి ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఆరంభ‌మ‌య్యేలా షెడ్యూల్ విడుద‌ల చేయ‌డం చ‌ట్ట‌, రాజ్యాంగ విరుద్ధ‌మంటూ ఉత్త‌మ్ హై కోర్టులో పిటిష‌న్‌ దాఖ‌లు చేశారు.

MORE NEWS: వేరే పార్టీ వారిని గెలిపిస్తే పనులు జరగవు

Latest Updates