జాన్సన్ అండ్ జాన్సన్ షాంపూ అమ్మకాలు నిలిపివేత

న్యూఢిల్లీ: జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ సమస్యల్లో చిక్కుకుంది. ఈ బ్రాండ్‌ బేబీ షాంపూ అమ్మకాలను తక్షణం నిలిపివేయాలని జాతీయ బాలల హక్కుల కమిషన్‌(ఎన్సీపీసీఆర్‌‌) అన్ని రాష్ట్రాలనూ, కేం ద్రపాలిత ప్రాంతాలనూ ఆదేశించింది. దుకాణాల్లోనూ స్టాక్స్‌ నూ తొలగించాలని స్పష్టంచేసింది. షాంపూలో కేన్సర్‌‌ కారకాలు ఉన్నాయని రాజస్థాన్‌ డ్రగ్‌ కంట్రోల్‌‌ ఆఫీసర్‌‌ తేల్చినందునే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌షాంపూలో హానికర పదార్థాలు ఉన్నట్టు వార్తలు రావడంతో రాజస్థాన్‌ ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టింది. ఇది అందజేసిన నివేదికపై స్పందించిన ఎన్సీపీసీఆర్‌‌ తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే దాకాషాంపూ అమ్మకాలను ఆపాలని స్పష్టంచేసింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ప్రతినిధి మాత్రం ప్రభుత్వ పరిశోధనను తోసిపుచ్చారు. ‘‘ప్రభుత్వ అధికారులు గుర్తుతెలియని పద్ధతుల్లో చేసిన పరీక్షలను మేం ఒప్పుకోం .సెంట్రల్‌‌ డ్రగ్స్‌ ల్యాబొరేటరీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. ఎన్సీపీసీఆర్ ఆదేశాలగురిం చి మాకు తెలియదు’’ అని అన్నారు.ఫార్మల్‌‌డీహైడ్‌ అనే పదార్థం ఉన్నందు నజాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బేబీ షాంపూ వాడకం హానికరమని రాజస్థాన్‌  డ్ర గ్‌కంట్రోల్‌‌ అధికారులు తేల్చారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టాల్కమ్‌ పౌడర్‌‌ పరీక్షఫలితాలను కూడా వెంటనే పంపించాలని ఎన్సీపీసీఆర్‌‌ రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 

Latest Updates