రాజస్థాన్‌లో జరుగుతున్న తమాషాను ఆపండి: గెహ్లాట్

ప్రధానికి గెహ్లాట్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో కలుగజేసుకోవాలని ప్రధాని మోడీకి అశోక్ గెహ్లాట్ మరోమారు విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందు ఓసారి మోడీని కోరిన గెహ్లాట్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌పై ఆయనకు ఫిర్యాదు చేశారు. తాజా అప్పీల్‌లో తమ రాష్ట్రంలో అక్రమంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనే రేటును పెంచారని తెలిపారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అక్రమ మార్గాల్లో ఎమ్మెల్యేలను హార్స్ ట్రేడింగ్ ద్వారా చేజిక్కించుకోవాలని బీజేపీ యత్నిస్తోందని భగ్గుమన్నారు. ‘రాజస్థాన్‌లో జరుగుతున్న తమాషాను ప్రధాన మంత్రి తప్పనిసరిగా ఆపాలి. హార్స్ ట్రేడింగ్ రేట్‌ కూడా పెరిగింది. ఇదేం తమాషా?’ అని అశోక్‌ గెహ్లాట్ జైసల్మేర్‌‌లో నేషనల్ మీడియాతో చెప్పారు.

Latest Updates