టాలీవుడ్ కే ‘తలకట్టు’! కోడి రామకృష్ణ హెడ్ బ్యాండ్ కథ

కోడి రామకృష్ణ సినిమా మేకింగ్ స్టైలే వేరు. అంతే కాదు.. ఆయన ఆహార్యం కూడా అంతే డిఫరెంట్. తెలుగులోనే కాదు.. దాదాపు ఏ సినీ ఇండస్ట్రీలోనూ లేని గుర్తింపు ఆయనకు ఉంది. అదే ఆయన తలకట్టు. తలకు ఎప్పుడూ ఓ రుమాలు కడతారు. కొందరు హెడ్ బ్యాండ్ అని కూడా అంటారు. ఆ హెడ్ బ్యాండ్ ఎంత పాపులర్ అంటే.. అది లేకుంటే కోడి రామకృష్ణను గుర్తుపట్టలేరు చాలామంది. కోడి రామకృష్ణకే ఆ తలకట్టు ఓ ప్రత్యేకను తీసుకొచ్చింది. ఐకానిక్ అయిపోయింది. ఇంతకీ ఆ తలకట్టు కథేంటో ఓసారి తెల్సుకుందాం.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కోడిరామకృష్ణ ఈ తలకట్టు కట్టుకునేవారు కాదు. ఎన్టీఆర్ తో ఓ సినిమాను  సమ్మర్ టైమ్ లో  షూటింగ్ చేస్తున్నప్పుడు… ఈ ఎండను మీరు భరించలేరు.. కర్చీఫ్ ఒకటి కట్టుకోండి అని.. ఎన్టీరామారావు పర్సనల్ కాస్ట్యూమర్ కోడిరామకృష్ణకు సూచన ఇచ్చారు. ఆ సూచనతో తలకు హెడ్ బ్యాండ్ కట్టుకున్నారు. అంతే… అది చూసిన ఎన్టీఆర్ సహా.. యూనిట్ అందరూ.. కోడి రామకృష్ణకు ఓ సూచన చేశారు. తలకు కట్టే కట్టుకు.. కోడి రామకృష్ణకు ఏదో సంబంధం ఉంది.. అది అలాగే ఉంచేయండి అని చెప్పారు. సినిమాలు హిట్లు కావడం… కెరీర్ సాఫీగా జరగడంతో… హెడ్ బ్యాండ్ ను కోడి రామకృష్ణ సెంటిమెంట్ గా భావించారు.

రానురానూ… తలకు కట్టు కట్టుకుని పనిచేసే ఒకే ఒక్క డైరెక్టర్ , టెక్నీషియన్ ఎవరంటే కోడిరామకృష్ణ అనే స్థాయిలో ఆయన గుర్తింపు వచ్చింది. కథా చర్చలు, మ్యూజిక్ సిట్టింగులు.. టీవీ, సినిమా ఇంటర్వ్యూలు.. పెళ్ళిళ్లు.. ప్రోగ్రాములు.. ఎక్కడికి ఆయన వెళ్లినా.. నిర్వాహకులు ఆయనతో తలకట్టు కట్టించారు. హెడ్ బ్యాండ్ ఉంటేనే మిమ్మల్ని జనం ఠక్కున గుర్తుపడతారు అంటూ చెప్పేవారు. వాళ్ల మాటను ఆయన గౌరవించేవారు. అలా… ఎవరికీ సాధ్యం కాని ఓ గుర్తింపునూ… స్పెషాలిటీని కోడి రామకృష్ణ సొంతం చేసుకున్నారు. అందరూ చెప్పాక తలకు బ్యాండ్ కట్టుకోవడం నా శరీరంలో ఓ భాగమైపోయింది అంటుండేవారు కోడిరామకృష్ణ.

కోడి రామకృష్ణ హెడ్ బ్యాండ్ .. ఓ అలంకరణ మాత్రమే కాదు. ఇండస్ట్రీలో 30 ఏళ్ల పాటు చెక్కుచెదరని సక్సెస్ లు కొట్టిన ఓ డైరెక్టర్ డెడికేషన్ ను సూచించే ఐకన్. జానర్ లు మార్చి… బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టిన ఓ ట్రెండ్ సెట్టర్ ను సూచించే సింబల్. నవతరానికి కావాల్సినంత ఉత్తేజం ఇచ్చే ఓ ఇన్ స్పిరేషన్.

Latest Updates