ఎడమ చేతివాటం ఎందుకో తెలుసా!

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్​.. అన్నాడో సినీ కవి. కానీ.. ‘కుడి చేత్తో రాయడం నేర్చుకో’,  ‘కుడికాలు పెట్టి లోపలికి రా..’ అంటూ ఎడమను తక్కువ చేసి చూస్తారు. అసలు ‘ఎడమంటే ఎందుకు అంత వివక్ష?’ అని  అడిగితే జవాబు దొరకదు. ఎలాంటి నష్టం లేకున్నా ఎడమంటేనే పెడమొహం పెడతారు. నిజానికి ఎడమ చేతివాటానికి కారణమేంటో తెలుసా?

ప్రపంచంలోని ప్రతి పది మందిలో ఒకరిది ఎడమ చేతివాటమే. కవల పిల్లలపై ఇప్పటిదాకా జరిగిన రీసెర్చ్​లు.. ఎడమ చేతి అలవాటుకు జీన్స్​తో సంబంధం ఉందని చెప్పినయ్​. కానీ కచ్చితంగా నిరూపించలేకపోయాయి​. ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ మొన్న విడుదల చేసిన ఓ రీసెర్చ్​ మాత్రం ఎడమచేతి అలవాటుకు జీన్సే కారణమని క్లియర్​ చేసింది. ఆ జీన్స్​ ఏవో కూడా సైంటిస్టులు గుర్తించారు. మెదడు పనిచేయడంలో ఈ జీన్స్​ ప్రభావం ఉందని తేల్చి చెప్పారు.

సైటో స్కెలిటన్​దే కీలక పాత్ర..

యూకేలోని బయోబ్యాంక్‌‌లో మొత్తం నాలుగు లక్షల మందికి చెందిన జీన్స్​ ఇన్ఫర్మేషన్​ ఉంది. ఇందులో 38 వేల మంది ఎడమచేతి అలవాటు వారే. అయితే కుడిచేతి అలవాటున్నోళ్లకు, ఎడమచేతి అలవాటు ఉన్నోళ్ల మధ్య తేడాలను తెలుసుకునేందుకు వాళ్ల మెదడు నిర్మాణంపై రీసెర్చ్​ చేస్తే.. ఏదో తేడా కనిపించింది. ఆ తేడాకు కారణం  కనిపెట్టాలని రీసెర్చ్​ను కంటిన్యూ చేశారు. దీంతో ‘కుడి, ఎడమ చేతి అలవాట్లను డిసైడ్​ చేసేది మెదడులో ఉండే సైటో స్కెలిటన్​ అనే పదార్థమని గుర్తించారు. అయితే ఈ సైటో స్కెలిటన్​లోనే ఎడమచేతి అలవాటును డిసైడ్​ చేసే జీన్స్​ను గుర్తించామని సైంటిస్టుల్లో ఒకరైన ప్రొఫెసర్ గ్వానెల్లే డావుడ్ అంటున్నాడు.

పరిశోధనలో ఏం తేలిందంటే..

 •   కుడి చేతి అలవాటు ఉన్న వాళ్లతో పోలిస్తే ఎడం చేతి అలవాటున్న వారి మెదడులోని కుడి, ఎడమ భాగాలు ఒకదానితో మరొకటి బాగా కలిసిపోయి ఉన్నట్లు గుర్తించారు.
 •   ఎడమచేతి అలవాటు ఉన్నవారి మెదడులో లాంగ్వేజ్​ స్కిల్స్​కు సంబంధించిన ప్లేస్​లు స్పష్టంగా కనిపించాయి. అందుకే లెఫ్ట్​ హ్యాండర్స్​ బాగా మాట్లాడతారని తేలింది.
 •   కుడి చేతి అలవాటున్న వారి కంటే ఎడం చేతి అలవాటున్న వారికి స్కిజోఫ్రీనియా అనే వ్యాధి వచ్చే ముప్పు ఎక్కువ.  అయితే పక్షవాతం వచ్చే ఛాన్స్​ లేదని తేలింది.

తాజా పరిశోధన ఎంత వరకు నిజం?

అయితే ఇప్పటికి కూడా ఎడమ చేతి అలవాటుతో సంబంధం ఉన్న జీన్స్​ గురించి సైంటిస్టులు తెలుసుకున్నది ఒక్క శాతమే. అంతేకాదు.. కేవలం బ్రిటన్ ​ప్రజల జీన్స్​ ఇన్ఫర్మేషన్​పైనే ఈ రీసెర్చ్​  జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే మిగతా వాళ్ల మెదళ్ల మీద కూడా రీసెర్చ్​ చేస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్​ వస్తదని ఇంకొంత మంది సైంటిస్టులు అంటున్నారు.

ప్చ్​.. ఎడమచేతి అలవాటు మాకెందుకు రాలే?

లెఫ్ట్​హ్యాండర్స్​ సామర్థ్యం తెలిస్తే మీరు కూడా మాకెందుకు ఎడమచేతి అలవాటు రాలేదని అనుకుంటారు.

 •   చాలా స్మార్ట్ గా ఉంటారు. చూడ్డానికే కాదు.. ఇంటెలిజెన్స్​లోనూ స్మార్టే.
 •   కుడి చేతి అలవాటున్నోళ్లకంటే.. ఎడమచేతి అలవాటు ఉన్నోళ్లు చాలా షార్ప్​గా ఉంటరు. వీళ్లు ఏ విషయాన్నైనా వెంటనే అర్థం చేసుకుంటరు. వీళ్ల మెదడులో ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చాలా స్పీడ్​గా జరుగుతుంది.
 •   ఏదైనా యాక్సిడెంట్​ జరిగినా, జ్వరమొచ్చినా  లెఫ్టీస్ తొందరగ కోలుకుంటరు.
 •   లెఫ్ట్ హ్యాండర్స్   ఏది చేసినా కొత్తగా ఉండాలని కోరుకుంటరు.
 •   కుడిచేతి అలవాటు ఉన్నవాళ్ల కంటే.. ఎడమచేతి అలవాటు ఉన్నోళ్లు  బాక్సింగ్, టెన్నిస్, బేస్ బాల్ ఆటలు బాగా ఆడుతరు.
 •   ఎడమచేతి అలవాటు ఉన్నోళ్లకు మెమరీ పవర్​ కూడా ఎక్కువ. ఎప్పుడో జరిగిన సంగతులు కూడా గుర్తుంచుకుంటరు.
 •   ఎడమచేతి అలవాటున్నోళ్ల ఆలోచనలు చాలా ఫాస్ట్ గా ఉంటయ్​. ఏ పనైనా వెంటనే చేస్తారు. అంతేకాదు.. వీళ్లకు ఒకేసారి రెండు మూడు పనులు చేసే కెపాసిటీ కూడా ఉంటుంది.
 •   లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్ల కోసం ‘ ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే’ని ప్రతి యేటా ఆగస్ట్ 13న సెలబ్రేట్ చేస్తారు..
 •   రైట్ హ్యాండెడ్ వాళ్ల కంటే.. లెఫ్ట్ హ్యాండర్స్​ సంపాదన చాలా ఎక్కువ. వీళ్లు 13 శాతం ఎక్కువ సంపాదిస్తరు. ‌‌‌‌
 •   ఎడమచేతి అలవాటు  ఉన్నోళ్లలో డ్రైవింగ్ స్కిల్స్ మెండుగ ఉంటయ్​.  మొదటిసారికే అన్ని డ్రైవింగ్ టెస్ట్ లు పాస్ అయిపోతరు.
 •   ఎడమచేతి అలవాటు ఉన్నోళ్లే ఎక్కువగా వ్యోమగాములుగా రాణిస్తారు. 25 శాతం మంది వ్యోమగాములు లెఫ్ట్ హ్యాండర్స్.
 •   లెఫ్ట్​ హ్యాండ్​ అలవాటున్నవారి మెదడుకు లెఫ్ట్, రైట్ రెండు వైపుల నుంచి సమాచారం అందడం వల్ల ఫాస్ట్​గా ఆలోచించే పవర్ ఉంటుంది.
 •   లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్లు ఎక్కువగా విజువలైజేషన్​ని ఇష్టపడతరు. వీళ్లకు రాయడం కంటే.. ఫొటోగ్రఫీ, పెయింటింగ్​ అంటే ఇష్టం.
 •   ఎడమచేతి అలవాటు  ఉన్నోళ్ల టైపింగ్ స్పీడ్ కూడా ఎక్కువే.  క్వెర్టీ కీబోర్డ్ పై  చాలా స్పీడ్​గా టైప్ చేస్తారు.
 •   ఎడమచేతి వాటం వాళ్లు ఎక్కువసేపు నీళ్లలో ఉండగలుగుతారు. పరిసరాలకు అనుగుణంగా అలవాటుపడే కెపాసిటీ వీళ్లకు ఎక్కువగా ఉంటుంది.
 •   లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్లు చాలా హుషారుగా ఉంటారు. వీళ్లు వీడియో గేమ్స్ బాగా ఆడతారు.
 •   కంప్యూటర్ డిజైనర్స్​లో ఎక్కువ మంది లెఫ్టీసే. క్రియేటివిటీ ఎక్కువగా ఉండడమే అందుకు కారణం.
 •   లెఫ్టీస్​  రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తారు. అమెరికా ప్రెసిడెంట్స్​గా ఎన్నికైన వారిలో ఎక్కువమంది ఎడమచేతి అలవాటు ఉన్నోళ్లే.
 •   లెఫ్ట్​ హ్యాండర్స్​ లెక్కలను చాలా ఫాస్ట్​గా చేస్తారు.
 •   ఎడమచేతి అలవాటు ఉన్నోళ్లలో  ప్రముఖులు, మేధావులు ఎక్కువ. ఐన్​స్టీన్​ న్యూటన్, మేరీ క్యూరీ, అరిస్టాటిల్, అలాన్ ట్యూరింగ్ వీరందరూ ఎడమచేతి అలవాటు ఉన్నోళ్లే.

Latest Updates