వింత ఆచారం.. మైనర్లకు పెళ్లి కాని పెళ్లి

మైనర్లైన ఓ అమ్మాయి,అబ్బాయికి పెళ్లిలాంటి తంతు జరిపిస్తారు. ఆ వేడుక చూడటానికి గ్రామమంతా కదిలి వస్తుంది. ఆ తర్వాత అంతా కలసి భోజనాలు చేస్తారు. అలా చేస్తే తమ గ్రామానికి మంచి జరుగుతుందని ఆ గ్రామస్తుల నమ్మకం.  ఈ వింత ఆచారం విశాఖ జిల్లా ఆనందపురం దుక్కవానిపాలెం గ్రామంలో అనాది కాలంగా వస్తోంది.

పండగ పూట అలా పెళ్లి జరిగితే తమ ఊరికి మంచి జరుగుతుందని ఆ గ్రామ ప్రజలు అంటున్నారు.కొన్ని వందల సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన బాలిక దుక్క అచ్చియమ్మ భర్త పొలంలో పాముకాటుకు చనిపోగా అప్పటి ఆచారం ప్రకారం భార్య సతీసహగమనం పాటించి భర్తతో పాటే చితిలో దూకి ప్రాణత్యాగం చేసిందట. ఆ తర్వాత ఆమె పేరున ఇక్కడ గుడి నిర్మించి అచ్చీయమ్మ పేరంటాలు పేరిట ఈ ఆనవాయితీగా ఈ తంతు జరిపిస్తున్నారు

ప్రతీ సంవత్సరం గ్రామానికి చెందిన అవివాహిత మైనర్లకు ఈ విధమైన పెళ్లి కాని పెళ్లి జరిపిస్తారు. అయితే ఆ తర్వాత వీరిద్దరికీ ఎటువంటి సంబంధం ఉండదు. ఆ తర్వాత పెళ్లీడు వచ్చాక తమకు నచ్చిన, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవచ్చు. చూడడానికి అనాగరికంగా అన్పించే ఈ సంప్రదాయాన్ని గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ కార్యక్రమం జరిగిన తర్వాతే ఆ గ్రామాల్లో శుభకార్యాలు ఆ సంవత్సరం నుండి మొదలు పెడతారు. అంత వరకు గ్రామంలో పెళ్లి వంటి కార్యక్రమాలు జరుపుకోరు.

 

Latest Updates