జగిత్యాలలో ఆర్టీసీ బస్సుపై దాడి

జగిత్యాల జిల్లాలో  ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.  కోరుట్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ లగ్జరీ బస్సును  జగిత్యాల వద్దకు  రాగానే  బుధవారం అర్థరాత్రి దాడిచేశారు. కారులో వచ్చిన ఆరుగురు బస్సును అడ్డుకుని అద్దాలు ధ్వంసం చేసి పారిపోయారు. దాడి సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై బస్సు డ్రైవర్  ఫిర్యాదు చేయడంతో దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Latest Updates