కొద్దిలో బుల్లెట్ తప్పించుకున్న ANI జర్నలిస్ట్

జమ్ములోని రాంబాన్ జిల్లా బటోట్ లో ఈ ఉదయం అంతా తీవ్రమైన ఉత్కంఠ పరిస్థితులు కొనసాగాయి. ఉగ్రవాదులు, సైనికుల మధ్య కాల్పులతో మార్కెట్ ఏరియా వణికిపోయింది. ఐతే.. ప్రింట్, ఎలక్ట్రానిక్, బ్రాడ్ కాస్టింగ్ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు మాత్రం రిస్క్ చేశారు. ఫొటోల కోసం ప్రయత్నిస్తున్న వారు ప్రాణాపాయం తప్పించుకున్నారు.

జాతీయ మీడియా ఏజెన్సీ ANI ప్రతినిధులు ఉగ్రవాదుల బుల్లెట్ గాయాలనుంచి కొద్దిలో తప్పించుకున్నారు. జర్నలిస్టులను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు ఫైరింగ్ చేశారు. ఈ ఫైరింగ్ లో ఏఎన్ఐ ప్రతినిధులకు సంబంధించిన కెమెరా ట్రై పాడ్ కు బుల్లెట్లు తగిలాయి. స్టాండ్ విరిగిపోయింది. కెమెరామెన్ , ఇతర సిబ్బంది మాత్రం అదృష్టవశాత్తూ చిన్నపాటి గాయాలతో ప్రాణాపాయం తప్పించుకున్నారు. ఈ ఫొటోలను ఏఎన్ఐ తమ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

Latest Updates