’స్ర్టీట్ ఆర్ట్’…ప్రేమ్ చిత్రాలు

కళ ఉంటే సరిపోదు.. దాన్ని అందంగా మలచడం, పదిమందిని ఆలోచింపజేయడం,ఆకట్టు కోవడం కూడా ముఖ్యం. హైదరాబాద్ కు చెందిన యువ చిత్రకారుడు ప్రేమ్ ఇస్రం తన కళతోనే ఆకట్టుకుంటున్నాడు.’స్ర్టీట్ ఆర్ట్’ పేరుతో గోడలనే కాన్వాస్ గా చేసుకొని అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తున్నాడు. ఆర్ట్​ అంటేనే ఆకర్షించడం. అందుకే స్ర్టీట్ ఆర్ట్​ను ఎంచుకున్నా’ అంటున్నాడు ప్రేమ్ . హైదరాబాద్ ల్లోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ పలు గోడలపై ప్రేమ్ చిత్రాలు కనిపిస్తాయి.

బాటసారులను, ప్రయాణికులను ఆకట్టుకుంటూ మదిని దోచేస్తాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచార వ్యవహారాలు.. ఇలా ఒక జానర్ అంటూ లేకుండా వెరైటీ చిత్రాలతో ఆకర్షిస్తున్నాడు ప్రేమ్‌. ఆదిలాబాద్ , వరంగల్ లోని మారుమూల ప్రభుత్వ బడుల గోడలపై తెలంగాణ పోరాట యోధులు, దేశ ప్రముఖులు, సైంటిస్ టుల బొమ్మలు గీస్తూ, వాటిని అందంగా మారుస్తున్నాడు. తనలోని కళను గ్రామీణ విద్యార్ థులకు పరిచయం చేస్తున్నాడు.మెళకువలు నేర్పిస్తూ పిల్లలను కళాకారులుగా తీర్చిదిద్దుతున్నాడు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక హైదరాబాద్ వచ్చిన ప్రేమ్ మంచి చిత్రాలు వేశాడు. ప్రేమ్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. చిన్నప్పట్నిం చే బొమ్మలపై ఆసక్తి పెంచుకున్న ప్రేమ్‌ ఎక్కడ గోడలు కనిపించినా చాక్ పీస్ లతో అందమైన బొమ్మలు వేసేవాడు. అయితే తనలోని కళకు అంతగా, గుర్తింపు రాక పోవడంతో కొన్నాళ్లు చదువుకే పరిమితమయ్యాడు.

బీటెక్ చదువుతున్న సమయంలో ప్రేమ్ చిత్రాలు చూసి తోటి స్నేహితులు ఆశ్చర్యపోయారు. ‘నీలో ఒక మంచి ఆర్టిస్ట్​ ఉన్నాడని’ ప్రోత్సహించారు. అప్పట్నించి పూర్తిస్థాయి ఆర్టిస్ట్గా మారాడు ప్రేమ్‌.ఇంజనీరింగ్ వదిలి, బొమ్మలపై దృష్టి పెట్టాడు. స్ర్టీట్ ఆర్ట్​ పేరుతో అద్భుతమైన బొమ్మలు వేస్తున్నాడు. ప్రస్తుతం జెఎన్ ఎఎఫ్ ఎయూలో ఫైన్ ఆర్స్ట్ కోర్సు చేస్తున్న ప్రేమ్కుస్ర్పే, పొట్రెయిట్ కళలో మంచి పేరుంది.

Latest Updates