కరోనా ఎఫెక్ట్ : జనాలు కనిపించకపోవడంతో ఎగవడుతున్న వీధికుక్కలు

వారాసిగూడకు చెందిన నర్సింహ సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తు న్నాడు. రాత్రి డ్యూటీ ముగించుకుని రోజూ వెళ్లే దారిలో బైక్ పై బయలుదేరా డు. సికింద్రాబాద్ రైల్వే కాలనీలో వెళ్తుండగా.. కుక్కల గుంపు మొరుగుతూ వెంటపడింది. కరిచే ప్రయత్నంచేయడంతో బైక్ వేగంగా నడిపి వాటి నుంచి తప్పించుకున్నాడు. చాదర్ ఘాట్ పీఎస్ పరిధిలో స్ట్రీట్ డాగ్స్ ను తప్పించబోయి బైక్ అదుపు తప్పింది. తలకు తీవ్ర గాయాలతో ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఈనెల 13న చనిపోయాడు. ఒక్కసారిగా వీధి కుక్కలు మీదికి రావడంతోనే యాక్సిడెంట్ జరిగినట్లు తర్వాత తెలిసింది… ….ఈ రెండే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల తీరులో వచ్చిన మార్పుల వల్ల పలు ఘటనలు జరుగుతున్నాయి. లాక్ డౌన్ వల్ల ఇండ్లలో ఉండలేక జనాలు ఇబ్బందులు పడుతుంటే.. బయట జనాల్లేక, తిండిలేక కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులు వింతగా ప్రవర్తిస్తున్నాయి

వీధి కుక్కలపై ఈ ప్రభావంఎక్కువ ఉంటోంది. దీంతో అవి తిక్కతిక్కగా ఉంటూ మను షులపై దాడులు చేస్తున్నాయి. రాత్రిళ్లు బైక్లను వెంబడిస్తున్నాయి. రోడ్లపై జనం, సరిపడా తిండి, తాగేందుకు నీళ్లు లేకే అవి అలా బిహేవ్ చేస్తున్నాయని వెటర్నరీ ఎక్స్ పర్ట్ లు చెబుతున్నారు.

జనాలు కనిపించక..

లాక్ డౌన్ కారణంగా జనాలు ఇండ్లకు పరిమితమైతే.. హైదరాబాద్లోని రోడ్లు, కాలనీలు, ప్రధాన కూడళ్లు కుక్కల గుంపులకు ఆవాసాలుగా మారాయి. రాత్రి ళ్లు కనుచూపు మేర జనాలు కనిపించకపోవడంతో అయోమయానికి గురవుతున్నాయి. నిర్మానుష్యంగా ఉన్న రోడ్లపై ఒక్కసారి భారీ శబ్దం చేస్తూ వెహికల్స్ వస్తే.. భయాందోళనకు గురై వింతగా, అగ్రెసివ్ గా మారుతున్నాయి. దొరికే తిండే తక్కువైపోవడం వల్ల కుక్కల్లోనే ఆహారం కోసం పోటీ పెరిగింది. కొత్తగా కనిపించే కుక్కల నుంచి రక్షించుకునే క్రమంలోనే అటాక్ అలవాటు చేసుకుంటాయి. ఇదే ప్రవర్తనను మనుషులపై చూపుతాయని వెటర్నరీ ఎక్స్ పర్టులు చెబుతున్నారు.

పెంపుడుకుక్కల్లో నూ..

ప్రస్తుత పరిస్థితుల్లో పెంపుడు కుక్కల బిహేవియర్ లోనూ మార్పులు వస్తాయని ఎక్స్ పర్ట్ లు  చెబుతున్నా రు. ఒంటరిగా ఫీలవుతాయనీ, దీంతో ఇంట్లో వస్తువులను ధ్వంసం చేస్తాయని అంటున్నారు. ఇలాంటి సందర్భాలు ఎదుర్కోకూడదంటే.. అతిగా వాటితో గడపకుండా, సాధారణ టైంలో మాత్రమే వాకింగ్, ఫీడింగ్ చేయాలని సూచిస్తున్నారు. కుక్కల గుంపులుకనిపిస్తే ఉరకొద్దు ప్రస్తుత పరిస్థితుల్లో కుక్కల గుంపులు కనిపిస్తేపరిగె త్తొద్దు. సాధారణంగా నడుస్తూవెళ్లాలి . బైక్ పై  వెళ్తుంటే స్పీడ్ పెంచొద్దు.

నెమ్మదిగా వెళ్తే.. ఎలాంటి ప్రమాదం లేదని భావించి కుక్కలు ఆగిపోతాయి. వీలైతే రాత్రి పూట కొంత ఆహారం అందించి, నీళ్లుపెట్టాలి . ఆకలి తీరితే అవి విచక్షణ కోల్పోకుండా ఉంటాయని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. ఎక్కువ సేపుగడపొద్దు పెంపుడు కుక్కల విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలి. వాటితో ఎక్కువ సేపు గడపొద్దు. తర్వాత దూరంగా ఉంటే లోన్లీగా  ఫీలై అటాకింగ్ కు అలవాటు పడతాయి. వాకింగ్ తీసుకెళ్లిన ళ్లి తర్వాత కాళ్లను శుభ్రంగా తుడవడం, ఇతరులు కుక్కలను ముట్ట కుండా చూసుకోవడమే బెటర్. – ప్రియాంక, డాగ్స్ బిహేవియర్ ఎక్స్ పర్ట్

సమస్య ఉంటేఫిర్యాదు చేయండి వీధి కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ సాగుతోంది. వీధి కుక్కల సమస్య ఎక్కువగా ఉంటే స్థానిక జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. పట్టుకుని యానిమల్ సర్వీస్ సెంటర్లకు తరలిస్తాం  – అబ్దుల్వకీల్, వెటర్నరీ చీఫ్, జీహెచ్ఎంస

Latest Updates