పోలీసు స్టేషన్ లో అర్ధరాత్రి పోలీసులపైనే జులుం

గుట్కా పట్టుకుంటారా..? మీ సంగతి చూస్తా..నంటూ పోలీసులపైనే దాడికి యత్నం

రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరి గూడ మండల పోలీస్ స్టేషన్లో ఎజాజ్ అలీ అనే వ్యక్తి కొందరు అనుచరులను వెంట బెట్టుకుని వచ్చి అర్ధరాత్రి వీరంగం సృష్టించాడు. వీధి రౌడీల్లా ప్రవర్తించారు. ఎస్సై కృష్ణ ఆధ్వర్యంలో గుట్కా జర్దా ప్యాకెట్లు పట్టుకున్న కేసులో తమ వారిని విడిచి పెట్టాలని కేకలు వేశాడు. అర్ధరాత్రి  మద్యం మత్తులో ఊగిపోతూ..  ఎజాజ్ అలీతో పాటు అతని అనుచరులు పోలీస్ స్టేషనుపై దాడికి పాల్పడ్డారు. కొందరు పోలీస్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారు. నానా బూతులు తిట్టారు. మీరు గుట్కాలు ఎలా పట్టుకుంటారని? పోలీసులతో ఘర్షణ పడ్డారు. పోలీసులు ఎంత నచ్చచెపినా వినకుండా అర్ధరాత్రి నానా హంగామా సృష్టించారని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై మండల ఎస్సై కృష్ణ ను వివరణ కోరగా నిజమేనని ఆయన ధ్రువీకరించారు.

Latest Updates