హోం క్వారంటైన్‌ పాటించని వారిపై కఠిన చర్యలు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించింది. అయితే కొంతమంది ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా రోడ్లపై తిరుగుతున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు బయటికి రాకూడదని చెప్పినప్పటికి వారు పట్టించుకోవడం లేదు. రోడ్లపైకి వస్తూ స్వేచ్చగా తిరుగుతున్నారు. దీంతో అధికారులు వారిపై దృష్టి సారించారు. హోం క్వారంటైన్‌ నిబందనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్న 16 మందిని క్వారంటైన్‌ సెంటర్లకు తరలించారు. లాక్‌డౌన్‌ పాటించకుండా అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు.

Latest Updates