అల అయోధ్య పుర‌ములో: పసుపు రంగులు.. కాషాయ జెండాలు

సుందరంగా ముస్తాబైన అయోధ్య‌
రామ నామజపంతో హోరెత్తుతున్న నగరం.. కట్టుదిట్ట‌మైన‌ భద్రతా ఏర్పాట్లు

చరిత్రలో నిలిచిపోయే రోజు కోసం అయోధ్య సర్వాగసుందరంగా ముస్తాబైంది. నగరమంతా రామ నామజపం, భజనలు, పోలీస్ సైరన్లతో హోరెత్తుతోంది. రామ జన్మభూమి సైట్కు వెళ్లేదారితో పాటు అయోథ్యలోని రోడ్లన్నీ ఎటు చూసినా కాషాయ జెండాలతో రెపరెపలాడుతున్నాయి . వీధులు, షాపులన్నీ పసుపు వర్ణం సంతరించుకున్నాయి. శ్రీరాముని కటౌట్లు, ప్రతిపాదిత రామ మందిరం ఫొటోలతో గోడలన్నీ నిండిపోయాయి. వీధులతోపాటు కరెంట్, టెలిఫోన్ పోల్స్ కు పసుపు రంగు క్లాత్, బంతి పూలతో అలంకరించా రు. నగరంలో ఉన్న వాళ్లు కూడా ఇంట్లోనే ఉండి కార్యక్రమం చూసేలా లైవ్ టెలికాస్ట్ చేసేందుకు సిటీలో లక్ష ఎల్సీడీ స్క్రీన్లను పెట్టారు.

బయటివారికి నో ఎంట్రీ

ప్రధాని మోడీ రాక నేపథ్యం లో భారీ సెక్యూరిటీ ఎరేంజ్ మెంట్స్ చేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అయోధ్య మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకుంది. ఆలయానికి వెళ్లేదారి పొడవునా రోడ్లకు ఇరువైపులా బారీ కేడ్లను ఏర్పాటు చేశారు. అయోధ్య ఎంట్రన్స్ లోనే అన్ని వెహికల్స్ ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితుల నుంచి ఫోన్ నంబర్లు, వివరాలు తీసుకుంటున్నారు. కరోనా ప్రొటోకాల్ ను ఫాలో కావడంపై ఫోకస్ పెట్టినట్టు చెప్పారు. సెన్సిటివ్ ఏరియాల్లో పోలీస్పికెట్ ఏర్పాటు చేశామన్నారు . లోకల్ వాళ్లు బయటకు రావాలన్నా ఐడీ కార్డు ఉండాలని చెప్పారు. 12 చోట్ల రూల్ డైవర్ష‌న్ చేసినట్టు చెప్పారు.

రామ మందిరం దగ్గర సీన్ ఇదీ..

రామ జన్మభూమి సైట్ దగ్గర భూమి పూజకు ఏర్పాట్లన్నీ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. పగలు రాత్రి అని తేడా లేకుండా అన్ని ఎరేంజ్ మెంట్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే భూమి పూజ కోసం ఎర్త్ మూవ‌ర్లతో భూమిని చదును చేశారు. భారీ కాషాయ రంగు షామియానా వేశారు. రెయి న్ప్రూఫ్ టెంట్ వేశారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో 9 పోల్స్ తో స్క్వేర్ ఆకారంలో ఈ టెంట్ ను వేశారు. స్టేజ్కు ఓ పక్కన 2 అడుగల ఎత్తైన శిలా ఫలకాన్ని ఉంచారు. 1989లో శిల న్యాస్ చేసిన ప్రాంతంలోనే దీనిని ఏర్పాటు చేశారు. దాని చుట్టూనే భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. భూమి పూజ జరిగే ప్రదేశానికి కుడివైపున భారీ ఎల్సీడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. సోషల్ డిస్టెన్స్ ను ఫాలో అవుతూ 175 మంది అతిథులు, సపోర్టింగ్ స్టాఫ్ కోసం సీటింగ్అరేంజ్మెంట్స్చేశారు. ఇన్విటేషన్ బోర్డు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అతిథులంతా ఉదయం 10.30 గంటలకే వెన్యూ దగ్గరికి చేరుకోవాలి. హైప్రొఫైల్ నెంబర్లు, రాజకీయ నేతలు హాజరుకానుండటంతో సెక్యూరిటీ ఎరేంజ్ మెంట్స్పై వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates