వర్క్ ఫ్రం హోం.. రిలేషన్స్ స్ట్రాంగ్

హైదరాబాద్‌‌ వెలుగు: వర్క్ ఫ్రం హోం చాలా బాగుందని టెకీలు చెబుతు న్నారు. ఫ్యామిలీ రిలేషన్స్ బ‌ల‌పడ్డాయని తెలంగాణ ఐటీ అసోసియేషన్(టీటా)నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆన్ సైట్ కు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ గా ఉండే ఉద్యోగులు కూడా ఇంట్లోనే వర్క్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. వర్క్ ఫ్రంహోం చేస్తున్న ఐటీ ఉద్యోగుల నుంచి టీటా పలు అంశాలను ఆన్ లైన్, ఆఫ్ లైన్, టెలిఫోనిక్ ద్వారా తెలుసుకుంది. ఈ సర్వేలో మొత్తం 500 శాంపిళ్లను సేక‌రించారు. ఇంట్లోనే ఉండి వర్క్ చేయడం వల్ల భార్యతో గడిపే సమయం పెరిగిందని చాలా మంది చెప్పారు. భాగస్వామితో రిలేషన్ ఎలా ఉందనే ప్రశ్నకు 88% టెకీలు స్ట్రాంగ్ అయ్యిందని తెలిపారు. వర్క్ ఫ్రం హోం కొన‌‌సాగిస్తే తమకెంతో అనుకూలంగా ఉంటుందని 82శాతం చెప్పారు. 73 శాతం మంది ఉద్యోగులు ఒత్తిడి లేకుండా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. టీటా ప్రెసిడెంట్ సందీప్ మక్తాల మాట్లాడుతూ.. నెల రోజులుగా సర్వే కొనసాగుతుందని, వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులకు మరిన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తామని చెబుతున్నారన్నారు.

సర్వే వివరాలు

వర్క్ ఫ్రంహోం ఇష్టపడేవారు : 82.29%
పని చేసేందుకువీలుగా ఉన్నవారు : -62.5%
ఇన్సెంటివ్ ప్రకటించిన కంపెనీలు : -8.33%
-8 గంటల్లోపు పని చేస్తున్నవారు: 2.08%
12 గంటలు పని చేస్తున్నారు: -8.33%
10-–- 12 గంటలు: 28.12%
8-– 10 గంటలు: 48.95%
8 గంటలు: 12.5%

భాగస్వామితో రిలేషన్ ఎలా ఉంది ?

బాగుంది: 88.54%
ఒత్తిడికి గురవుతున్నవారు: 37.5%
ఆన్ సైట్ ఆసక్తి ఉన్నవారు: 42.70%

మ‌రిన్ని వార్త‌ల కోసం

రాష్ట్రంలో కరోనా కేసులు 5,000 దాటినయ్

Latest Updates