GHMC ఎన్నికలకు పటిష్ట భద్రత

GHMC ఎన్నికలకు పటిష్టవంతమైన భద్రత ఏర్పాట్లు చేశామని తెలిపారు హైదరాబాద్‌ సీపీ‌ అంజనీ కుమార్‌. నగరంలో ఉన్న అన్ని డీఆర్‌సీ కేంద్రాలను పరిశీలించి, సిబ్బందితో చర్చించినట్లు తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రేటర్ ఎన్నికలు నిర్వహించడం తమ బాధ్యత అని అన్నారు. అన్ని పోలింగ్‌ సెంటర్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, కేంద్ర బలగాలు కూడా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 9 కేసుల్లో పట్టుబడిన హవాలా నగదును ఇన్‌కమ్‌ ట్యాక్స్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ఆయుధాల లైసెన్స్‌ కలిగిన వారు ఎన్నికల సమయంలో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించాలన్నారు. ఇప్పటికే 1500ల లైసెన్స్‌ ఆయుధాలు డిపాజిట్‌ అయినట్లు చెప్పారు సీపీ.

Latest Updates