రాజకీయాలకు అతీతంగా కరోనాపై పోరాటం

కరోనా కట్టడికి అధికారులు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్. రాష్ట్రంలోమరి కొన్ని వారాలు లాక్ డౌన్ కొనసాగుతుందన్నారు. మార్కజ్ వెళ్లిన వారి కారణంగానే నిజామాబాద్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాపించిందన్నారు. కీలక సమయంలో అధికారులపై రాజకీయ నేతల ఒత్తిడి సరైంది కాదన్నారు.అధికారులకు సహకరించాల్సిందిగా TRS,MIM  పార్టీలను కోరుతున్నామన్నారు. కరోనా అనుమనితులను క్వారైంటైన్ కు తరలించేందుకు సహకరించాలన్నారు.

జనాభా ఎక్కువ ఉన్న ఉత్తర ప్రదేశ్ కన్నా…మన రాష్ట్రంలోనే కరోనా ప్రభావం తీవ్రంగా ఉందన్నారు ఎంపీ అర్వింద్.ఇది ఆందోళన కల్గించే విషయమన్నారు. కరోనా కట్టడి చేసే విషయంలో అధికారులకు స్వతంత్రత ఇవ్వాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోనా నివారణ చర్యలు భేష్ గ్గా ఉన్నాయన్నారు. అందరూ ఇళ్లలోనే ఉండి… లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు. అమెరికాకు మందులు సప్లయ్ చేసే స్థాయికి మన దేశాన్ని తీసుకెళ్లిన మోడీ నాయకత్వంలో పని చేయటం ఆనందంగా ఉందన్నారు. కరోనాపై కేంద్రం ఎప్పటి కప్పుడు పార్లమెంట్ సభ్యులతో చర్చిస్తోందన్న అర్వింద్… రాజకీయాలకు అతీతంగా వైరస్ పై పోరాటం చేయలన్నారు.

మరోవైపు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ఎంపీ అర్వింద్. గన్నీ బ్యాగ్ లు కూడా అందించడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల  దగ్గర రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు.

Latest Updates