స్కూల్ బిల్డింగ్ పై నుంచి పడి విద్యార్థిని మృతి

హైదరాబాద్ నాగోల్ సాయి నగర్ లో దారుణం జరిగింది. స్థానిక నాగార్జున స్కూల్ లో పదో తరగతి చదువుతున్న వివిక అనే విద్యార్థిని ప్రమాదవ శాత్తు స్కూల్ బిల్డింగ్ పై నుంచి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే వివికను టీచర్స్ కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వివిక చనిపోయింది. స్కూల్ యాజమాన్య సరైన సేఫ్టీ ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని విద్యార్థిని కుటుంబసభ్యులు ఆరోపించారు.

Latest Updates