ట్రిపుల్ ఐటీలో అమ్మాయి ఆత్మహత్యాయత్నం

కృష్ణా జిల్లా : నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఫస్టియర్‌ విద్యార్థిని అంబటి దివ్య సూసైడ్ అటెంప్ట్ చేసింది. హాస్టల్‌ రూమ్ లో ఆమె కొకొనట్ ఆయిల్ ను తాగింది. వెంటనే ఆమెను నూజివీడు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జీజీహెచ్‌కు తరలించారు.

దివ్య సొంతఊరు కడప జిల్లా తిప్పరాజుపాలెం.  సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను తెల్సుకునే ప్రయత్నంచేస్తున్నారు.

Latest Updates