పరీక్ష హాల్‌లోకి రానీయలేదని స్టూడెంట్​ సూసైడ్

కల్వకుర్తి, వెలుగు: సమయానికి ఎగ్జామ్​సెంటర్ కు చేరుకోలేకపోవడంతో పరీక్ష రాయనందుకు మనస్తాపం చెందిన ఓ స్టూడెంట్  ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్​కర్నూల్​ జిల్లా ఊర్కొండ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మన్నపల్లికి చెందిన శ్రీశైలం బుధవారం.. ఢిల్లీ పోలీస్​ కానిస్టేబుల్​ పరీక్ష రాసేందుక హైదరాబాద్ కు వెళ్ళాడు. అయితే ఎగ్జామ్ సెంటర్ కు సమయానికి వెళ్ళకపోవడంతో అధికారులు పరీక్షహాల్​లోకి అనుమతించలేదు. దీంతో మనస్తాపం చెందిన శ్రీశైలం ఊరికి తిరిగి వచ్చి తన వ్యవపాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

For More News..

నాలాలపై క్యాపింగ్ ఉత్తమాటే!

బస్తీ ఓటర్లపైనే కార్పొరేటర్ క్యాండిడేట్ల ఫోకస్

ఎన్నికల తర్వాత వరద సాయం డౌటే

Latest Updates