ఎంసెట్ లో ర్యాంక్ రాలేదని ప్రాణం తీసుకున్నడు

జగిత్యాల, వెలుగు: ఎంసెట్ లో ర్యాంక్ రాలేదని స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా హుస్నాబాద్ కు చెందిన  తనూర్ భీమయ్య, జల దంపతులకు ఇద్దరు కొడుకులు. ఇంటర్ పూర్తి చేసిన పెద్దకొడుకు వెంకటేశ్వర రావు ఎంసెట్ ఎంట్రెన్స్ రాశాడు. మంగళవారం రిజల్ట్స్ వచ్చిన తర్వాత పొలంకాడికి పోతున్నానని ఇంట్లోంచి వెళ్లిన వెంకటేశ్వరరావు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పొలం దగ్గరికి వెళ్లి చూడగా బావిలో శవమై కన్పించాడు. కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్నవారిని కంటతడి పెట్టించాయి. వెంకటేశ్వరరావు ఎంసెట్ క్వాలిఫై కాలేదన్న సంగతి ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని ప్రాణాలు తీసుకున్నాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేసు దర్యాప్తు చేపట్టారు .

Latest Updates