స్టూడెంట్స్ దుస్తులు విప్పించి చెకింగ్

నెలసరి టైమ్​లో..కిచెన్​లోకా?
స్టూడెంట్స్​పై విరుచుకుపడిన ప్రిన్సిపాల్
దుస్తులు విప్పించి చెకింగ్​.. విచారణకు ఎన్​సీడబ్ల్యూ ఆదేశం

న్యూఢిల్లీనెలసరి టైమ్​లో వంటగదిలోకి, పూజ గది సమీపానికి  వెళుతున్నారని ఓ కాలేజీ ప్రిన్సిపల్ ​కోపానికొచ్చింది. హాస్టల్​లోని 68 మంది స్టూడెంట్లను పిలిపించింది. రెస్ట్​ రూంలో వారి లోదుస్తులను బలవంతంగా విప్పించి చెక్​ చేసింది. ఈ దారుణం గుజరాత్ భుజ్ లోని శ్రీ సహజానంద గర్ల్స్ ఇనిస్టిట్యూట్​లో జరిగింది. ఈ వార్త బయటకు రావడంతో సదరు ప్రిన్సిపాల్​ చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. నేషనల్​ కమిషన్​ ఫర్​ విమెన్(ఎన్​సీడబ్ల్యూ) కల్పించుకుని విచారణకు ఆదేశించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించినట్లు తెలిపింది. ఢిల్లీ నుంచి ఎన్‌‌సీడబ్ల్యూ టీమ్‌‌ గుజరాత్‌‌కు వెళ్లి స్టూడెంట్స్‌‌తో మాట్లాడుతుందని అధికారులు చెప్పారు.

భుజ్‌‌లోని శ్రీ సహజానంద గర్ల్స్‌‌ ఇనిస్టిట్యూట్‌‌ స్వామి నారాయణ్​ మందిర్‌‌‌‌ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ కాలేజీలో రూల్స్‌‌ చాలా ఎక్కువ. నెలసరిలో ఉన్న అమ్మాయిలు కాలేజీ హాస్టల్‌‌లోని వంటగది, దేవుడి గదిలోకి వెళ్లకూడదనే రూల్​ ఉంది. కొంతమంది డిగ్రీ అమ్మాయిలు నెలసరి టైంలో వంటగదిలోకి వెళ్లారని ప్రిన్సిపల్‌‌కు కంప్లయింట్‌‌ అందింది. దీంతో 68 మంది స్టూడెంట్స్‌‌ను రెస్ట్‌‌రూంకు తీసుకెళ్లి వారితో బలవంతంగా లో దుస్తులు విప్పించి చెక్​ చేయించారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates