ఐదు వేళ్లలో పెద్దగా బొటనవేలు

వేళ్లకు పెద్దన్న బొటనవేలని తెలుసు కదా. అయినా, ఒక్క చిటికెన వేలిని పక్కనబెడితే, అన్నింటికన్నా బొటనవేలే చిన్నగా ఉంటుంది. అది లేకపోతే దేన్నీ పట్టుకోలేం. ఏ పనీ చేయలేం. ఈ ఫొటో చూడండి. బొటనవేలు తేడాగా కనిపించట్లేదూ!! మామూలుగా అయితే, బొటన వేలు రెండించులుంటుంది. కానీ, అతడికి మాత్రం ఐదు అంగుళాలుంటుంది. అమెరికాలోని మసాచుసెట్స్​కు చెందిన జాకబ్​ పీనా అనే స్టూడెంట్​ బొటన వేలు మామూలు వేళ్లకన్నా పొడవుగా ఉంటుంది. అతడో సారి టిక్​టాక్​ వీడియో చేయడంతో మస్తు ఫేమస్​ అయిపోయిండు.

అంత పేరు రావడానికి కూడా కారణం అతడి బొటనవేలే. ఎప్పుడైతే ఫస్ట్​ టిక్​టాక్​ వీడియో చేశాడో, అప్పటి నుంచి అతడికి ఫాలోవర్లు పెరుగుతున్నారు. ఇప్పుడు అతడిని ఫాలో అవుతున్న వారి సంఖ్య 15 వేలకు పైనే. మనోడికి క్రేజ్​ బాగా పెరిగిపోవడంతో ఆ బొటనవేలిపైనే ఎక్కువగా టిక్​టాక్​ వీడియోలు చేస్తున్నాడు. కొందరు నెటిజన్లు అది థంబ్​ కాదని, పెద్ద కత్తని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు మాత్రం ఆ వేలితో తిండెట్లా తింటావ్​ రా బాబు అని కామెంట్​ చేస్తున్నారు.

Latest Updates