హాస్టల్ లో కరెంటు షాక్ .. విద్యార్థిని మృతి

ఖమ్మం ఎస్ సి హాస్టల్ లో కరెంట్ షాక్ తో ఓ విద్యార్థిని చనిపోయింది. మరో నలుగురు హాస్పత్రి పాలయ్యారు. ఎన్ ఎస్ పీ కాలనీలోని ఎస్సీ బాలికల హాస్టల్ లో రాత్రి 11 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఒక్కసారిగా పొగ కమ్ముకొని, మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న యువకులు వచ్చి అమ్మాయిలను బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలో పొగ దాటికి తట్టుకోలేక నాలుగో తరగతి చదువుతున్న చిన్నారి స్పందన చనిపోయింది. మరో నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని హాస్పిటల్ కు తరలించారు. హాస్టల్ లో మొత్తం 35 మంది విద్యార్థినులు ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. హాస్టల్ లోని విద్యార్థినుల బెడ్ సీట్లన్నీ కాలిపోయాయి. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు ఎస్ సి సంక్షేమ శాఖ డీడీ సత్యనారాయణ.

Latest Updates