పోలీసు కేసు : నవ్వాడని స్టూడెంట్ ని చితకబాదిన టీచర్

హైదరాబాద్: క్లాస్ రూమ్ లో ఓ టీచర్ సహనం కోల్పోయాడు. స్కూల్లో నవ్వాడని విద్యార్థిని చితకబాదాడు. దీంతో స్టూడెంట్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన బుధవారం హైదరాబాద్ లో జరిగింది.  వివరాలు : పంజాగుట్టలోని ఇక్రా హైస్కూల్లో అబ్దుల్ మజీద్ అనే స్టూడెంట్ 7వ తరగతి చదువుతున్నాడు.

బుధవారం స్కూల్లో విద్యార్థి నవ్వాడని టీచర్ జీషన్ సహనం కోల్పోయి మజీద్ ని చితకబాదాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ ల్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు వర్గాలను పీఎస్‌ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపివేశారు పోలీసులు.

 

Latest Updates