జ్వరం తగ్గడం లేదని విద్యార్థిని ఆత్మహత్య

హయత్ నగర్,వెలుగు : అనారోగ్య సమస్యతో బాధపడుతున్న  ఓ బాలిక కిరోసిన్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకుంది. హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆ బాలిక శనివారం చనిపోయింది. హయత్ నగర్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామానికి చెందిన చెందిన నీలకంటి భార్గవి(16) స్థానికంగా ఉన్న గవర్నమెంట్ హైస్కూల్ లో టెన్త్ క్లాస్ చదువుతోంది.  బార్గవి  కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఎన్నిరోజులైనా జ్వరం తగ్గడం లేదని శుక్రవారం రాత్రి 10.30 గంటలకు భార్గవి ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆ సమయంలో ఇంటి బయట నిద్రిస్తున్న ఆమె తండ్రి భార్గవి అరుపులను విని..వెంటనే స్థానికుల సాయంతో మంటలను అర్పివేశాడు. బార్గవిని ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ భార్గవి శనివారం ఉదయం చనిపోయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates