స్కూల్ ఎన్నికల్లో ఓటమి : స్టూడెంట్ సూసైడ్

student-suicide-under-train

యాదాద్రి భువనగిరి జిల్లా: సర్కార్ స్కూల్ కమిటిలో భాగంగా నిర్వహించిన ఎన్నికల్లో ఓడిపోయిన ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. ఎన్నికల్లో ఓడిపోవడంతో మనస్తాపం చెందిన విద్యార్థి.. జిల్లాలోని భువనగిరి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన చరణ్‌ గా గుర్తించారు. చరణ్ ఎనిమిదో తరగతి చదువుతున్నట్లు తెలిపారు స్థానికులు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భువనగిరి ఏరియా హస్పిటల్ కి తరలించారు. స్కూల్ లో నిర్వహించిన ఎన్నికల్లో చరణ్ ఓటమి చెందాడు. మనస్తాపంతో నిన్న ఇంటి నుంచి వెళ్లిన చరణ్ ఈ రోజు పట్టాలపై శవమై కనిపించాడని కన్నీరుమున్నీరయ్యారు చరణ్ తల్లిదండ్రులు.

Latest Updates