విద్యాభవన్ ను ముట్టడించిన విద్యార్ధి సంఘాలు

డిగ్రీ కళాశాలలో ఉన్న పీజీ కేంద్రాలను ఎత్తివేతకు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాలు హైద్రాబాద్ లో ఆందోళనకు దిగాయి . పిడిఎస్.యూ ఏఐఎస్ఎఫ్ , ఎస్ఎఫ్ఐ , టివివి , ఏఐడిఎస్ఓ ర్యాలీ గా వచ్చిన విద్యార్థి సంఘ నాయకులు నాంపల్లి లోని విద్యా భవన్ ను ముట్టడించారు. ఈ సందర్బంగా విద్యార్థి నాయకులు గేటు లోపలికి చొచ్చుకు పోవడానికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి బేగం బజార్ పోలి స్టేషన్ కు తరలించారు. వేలాది మంది విద్యార్థులకు అన్యాయం చేసే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే అధికారులు ఈ చర్యకు పునుకున్నారని వారు మండిపడ్డారు. గతంలో ఉన్న విధంగానే పీజీ కేంద్రాలను కొనసాగించాలని… లేని పక్షంలో ఆందోళనను ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.

Latest Updates