స్టూడెంట్ ఘనత: కరోనాకు ఓ యాప్

కరోనా ఇన్ఫో ట్రాకర్ పేరుతో యాప్
ఎస్ఎంఆర్ స్టూడెంట్ ఘనత

హైదరాబాద్‍, వెలుగు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్ఎంఆర్ స్టూడెంట్ అనుపమ్ తివారీ “కరోనా ఇన్ఫో ట్రాకర్”  పేరుతో యాప్ రూపొందించాడు. కట్టాంకులత్తూరులోని ఎస్‍ఆర్‍ఎం ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్ సైన్స్ అండ్‍ టెక్నాలజీ (ఎస్‍ఆర్‍ఎంఐఎస్‍టీ)  చెందిన ఎలక్ట్రికల్‍ ఇంజినీరింగ్‍ అండ్‍ కంప్యూటర్ సైన్స్(ఈఈసీఎస్‍) లో అనుపమ్ చదువుతున్నాడు. కరోనా ఉధృతంగా ఉండటంతో ప్రజల్లో అవగాహన పెంచేందుకు యాప్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేశానని అనుపమ్ చెప్పారు. ఈ యాప్ లో రియల్ టైం డేటాతో కరోనాకు సంబంధించి పూర్తి సమాచారం ఉంటుందని, ప్రతి ఒక్కరికీ యాప్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

హాంగ్‍కాంగ్‍ యూనివర్సిటీకి చెందిన అనుష్క పురోహిత్‍, యూసీబీ మెకానికల్‍ ట్రానిక్స్ కు చెందిన సాహిల్‍ మెహతా, ఎంబీఏ హోస్‍ స్కూల్‍ ఆఫ్ బిజినెస్‍ స్టూడెంట్‍ అకోన్‍క్వా ముబాగ్వా, మాన్యుయల్‍ స్మిత్, డాక్టర్‍ సేవిత్‍, సాఫ్ట్ వేర్‍ డెవలపర్‍ డేనియల్‍ స్మిత్‍, రావులతో కలిసి ఈ యాప్ ను చేశానని అనుపమ్ చెప్పారు. యాప్ రూపొందించిన స్టూడెంట్స్ ని (ఎస్‍ఆర్‍ఎంఐఎస్‍టీ) వ్యవస్థాపక చాన్సలర్‍ ‍పారవేందర్‍, ఫ్రొఫెసర్,  చాన్సలర్‍ రవి పచ్చముత్తు, డాక్టర్ పి. సత్యనారాయణ, వైస్‍ చాన్సలర్‍ డాక్టర్ సందీప్‍ సంచేటి, రిజిస్ట్రార్‍ సేతునామన్‍లు అభినందించారు.

భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు

కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది

 

Latest Updates