స్కూల్ టీచర్ ను దారుణంగా కొట్టిన స్టూడెంట్స్

రాయ్‌ బరేలీ:  విద్యా బుద్ధులు నేర్పించే టీచర్ పైనే విద్యార్థులు దారుణంగా దాడి చేశారు. పట్టుమని పదేళ్లు కూడా లేవు. కానీ.. ఆ టీచర్ ను స్టూడెంట్స్ మూకదాడి చేశారు. నిత్యం అవమానించేవారు. బాత్ రూమ్ కి వెళ్లినప్పుడు బయటినుంచి డోర్ పెట్టడం. ఆమె పేరుతో అరుపులు వేయడం చేశారు. అవమానంతో కొన్ని రోజులు స్కూల్ బంద్ చేసింది టీచర్. ఈ సోమవారం మళ్లీ డ్యూటీకి వచ్చిన టీచర్ ను ఒక్కదాన్ని చేసి ఆడుకున్నారు స్టూడెంట్స్. ఆమె బ్యాగ్ తీసి విసిరేసి, బూతులు తిట్టారు. కుర్చీతో ఆమెను దారుణంగా కొట్టారు. ఉత్తరప్రదేశ్, రాయ్ బరేలీలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

వివరాలు:  రాయ్‌ బరేలీలో గాంధీ సేవా నికేతన్‌ స్కూల్ లో  టీచర్ గా పని చేస్తుంది మమతా దూబే. కొన్ని రోజులుగా స్కూల్ మేనేజర్, మమతా తరుచుగా గొడవ పడుతున్నారు. టీచర్ పై కక్ష్య పెంచుకున్న మేనేజర్ స్కూల్ పిల్లలతో ఆమెను వేధించడం ప్రారంభించాడు. సోమవారం ఏకంగా టీచర్ పై దాడి చేయడంతో ఆమె కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది.

దీనిపై బాధితురాలు మమతా మాట్లాడుతూ.. మేనేజర్‌ తో భేదాభిప్రాయాలు ఉన్నాయని, అందుకే అతడు తనను ఇటీవల విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. దీనిపై తాను కలెక్టర్‌ నేహా శర్మను సంప్రదించినట్లు తెలిపారు. తనను విద్యార్థులు వాష్‌ రూంలో బంధించారని అధికారులకు చెబితే, పిల్లలు తమకు ఇష్టం వచ్చినట్లు చేస్తారని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారన్నారు. రెండు రోజుల తర్వాత నికేతన్‌ కు వెళ్లగా విద్యార్థులు ఈ దాడి చేశారని తెలిపారు. మేనేజరే ఈ దాడి చేయించాడని ఆమె ఆరోపించారు. కలెక్టర్ ఆదేశాలతో సీసీటీవీ పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు స్థానిక పోలీసులు.

Latest Updates