51 మంది స్కూలు పిల్లలకు కరెంట్ షాక్

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బలరామ్ పూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రైమరీ స్కూల్ లో హై టెన్షన్ వైర్లు తెగిపడటంతో… పిల్లలకు ఎలక్ట్రిక్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో 51 మంది స్కూలు పిల్లలు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.

పోలీసులు, స్కూలు యాజమాన్యం చెప్పిన కథనం ప్రకారం… ఉదయం 10 గంటలకు ఈ సంఘటన జరిగింది. స్కూలు ఆవరణలో ఉన్న ఓ చెట్టుపై హైటెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. ఆ చెట్టు దగ్గర్లోనే గోనె సంచులపై కూర్చున్న విద్యార్థులకు కరెంట్ షాక్ తగిలింది. చెట్టుగుండా కరెంట్ గ్రౌండ్ అయ్యింది. టీచర్లు వెంటనే చెప్పులు వేసుకుని అక్కడికి పరుగెత్తుకు వచ్చారు. స్కూలు పిల్లలను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. హాస్పిటల్ లో 51 మంది పిల్లలకు ట్రీట్ మెంట్ కొనసాగుతోంది.

ఈ సంఘటనలో ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

Latest Updates