బీకాం జనరల్‌‌కు గుడ్ బై!

డిగ్రీ కాలేజీల్లో బీకాం జనరల్‌‌ కోర్సును కుదించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం అకౌంట్స్‌ కు సంబంధించిన వ్యవహారాలన్నీ కంప్యూటర్‌ పైనే చేస్తున్నారు. ఇప్పటికే చాలా కాలేజీల్లో బీఎం(కంప్యూటర్​ అప్లికే షన్) కోర్సుతోపోలిస్తే బీకాం జనరల్‌‌ కోర్సులో స్టూడెంట్ల సంఖ్యతక్కువగా ఉంది. బీకాం జనరల్ కోర్సు చదివినస్టూ డెంట్స్‌ కు ఉపాధి అవకాశాలూ ఎక్కువగాఉండటం లేదు. దీంతో ఈ కోర్సు స్థానంలో బీకాం(-కంప్యూటర్‌ అప్లికే షన్‌ ) కోర్సుకు అనుమతించాలని భావిస్తోంది. రెండు, మూడేండ్లలో జనరల్ కోర్సును పూర్తిగా తీసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మే 6 వరకూ ఏ కాలేజీల్లో ఏఏ కోర్సులున్నాయి.. ఎంతమంది విద్యార్థులున్నారు? అనే వివరాలను ఉన్నత విద్యా మండలికి పంపించాలని అన్నికాలేజీల యాజమాన్యాలకు ఆదేశాలు వెళ్లాయి. ఆవివరాల్లో బీకాం జనరల్‌‌లో 10, అంతకంటే తక్కువ సీట్లున్న కాలేజీల్లో ఇకపై అడ్మిషన్లకు అనుమతి నిరాకరించాలని అధికారులు భావిస్తున్నారు. యాజమాన్యం కోరితే జనరల్ కోర్సు ప్లేస్​లో కంప్యూటర్‌ అప్లికేషన్‌ కోర్సుకు అవకాశం ఇవ్వాలని, అప్పటికే ఆకాలేజీలో కోర్సు ఉంటే సీట్లను పెంచాలని యోచిస్తున్నారు.

Latest Updates