మహేశ్​బాబు​ ఇంటి ముట్టడికి యత్నం

హైదరాబాద్(జూబ్లీహిల్స్), వెలుగు: ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్​కు మద్దతివ్వాలంటూ ఏపీ విద్యార్థి యువజన పోరాట సమితి హీరో మహేశ్ బాబు ఇంటి ముట్టడికి ప్రయత్నించింది. శుక్రవారం ఫిల్మ్​నగర్​లోని మహేశ్ బాబు ఇంటిముందుకు చేరుకున్న సమితి సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని, తర్వాత వదిలేశారు. ఈ సందర్భంగా జై ఆంధ్రప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ జిలానీ మాట్లాడుతూ.. అమరావతి కొనసాగింపునకు సినీ నటులు అందరూ మద్దతివ్వాలని, లేదంటే హీరోల ఇంటిముందు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా వెంటనే కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్​ చేశారు.

Students protest at Mahesh babus residence demands amaravathi to be the capital of ap

Latest Updates