ఉగ్రదాడికి వ్యతిరేకంగా కర్నూలులో విద్యార్థుల భారీ ర్యాలీ

జమ్ముకాశ్మీర్ లో ఉగ్రదాడిని నిరసిస్తూ కర్నూలు విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిమంది విద్యార్థులు ఉగ్ర వాదుల ఘాతుకాన్ని నిరసిస్తూ ప్లే కార్డులు ప్రదర్శించారు. దారి పొడవునా నినాదాలతో హోరెత్తించారు. భారీ ర్యాలీతో.. కర్నూలు రోడ్లు, కొండారెడ్డి బురుజు సర్కిల్ లో ఎక్కడ చూసినా విద్యార్థులే కనిపించారు.

విద్యా సంస్థల jac నాయకులు రవీంద్ర పుల్లయ్య, కట్టమంచి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వాసుదేవయ్య, డిగ్రీ కాలేజీల తరపున శౌరిలు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాద దాడులను తిప్పికొట్టాలని, దాడుల్లో చనిపోయిన అమర వీరులకు స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Latest Updates