జీవిత పాఠాలకు రాజీలేని పది సూత్రాలు

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సత్ప్రవర్తన పెంచడమే లక్ష్యం
ప్రతి రోజూ ఉదయం ప్రేయర్‌ సమయంలో బోధన
యాదాద్రి జిల్లాలో ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వీటిపై అవగాహన

విద్యార్థుల ప్రగతికి రాజీలేని పది సూత్రాలను ప్రవేశపెట్టింది విద్యాశాఖ. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, తనకు తానుగా ఆలోచించేట్లు చేయడం, సామాజిక బాధ్యతను పెంపొందించడం, సొంతంగా పైకి ఎదిగే లక్షణాలను పెంపొందించడం వంటి అనేక అంశాలను వారిలో పెంపొందిస్తుంది. భావిభారత పౌరులుగా తయారు చేసే లక్ష్యంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశాఖ రాజీలేని పది సూత్రాలను విద్యార్థులకు టీచర్లు ప్రతి రోజూ ఉదయం ప్రేయర్‌ సమయంలో బోధిస్తు న్నారు.

పాఠశాలల్లోనే జీవిత సూత్రాలు

యాదాద్రిభువనగిరి జిల్లాలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ప్రతిరోజూ ఈ పది సూత్రాలను ప్రేయర్ సమయంలో ఉపాధ్యాయులు వాటిని గుర్తు చేస్తూ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపుతున్నారు. అంతేకాకుండా ప్రతి క్లాస్‌ టీచర్‌ వీటిని రోజూవారీ కార్యక్రమాల్లో భాగంగా గుర్తు చేస్తుంటారు. గతంలో పెద్దలు, తల్లిదండ్రులు ఇంటి దగ్గర తమ పిల్లలకు, విద్యార్థులకు జీవితానికి సంబంధించిన పలు మంచి మాటలను చెప్తుండేవారు. మారుతున్న కాలంలో భాగంగా ప్రస్తుతం అలాంటి పరిస్థితులు తగ్గిపోవడం, బిజీ లైఫ్‌ ఉన్నందు వల్ల పాఠశాలల్లోనే ఇలాంటి జీవిత సూత్రాలు విద్యార్థులకు అందించేందుకు విద్యాశాఖ ప్రయత్నం చేస్తుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమం నెల రోజుల నుంచి జిల్లావ్ యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో విజయవంతంగా నిర్వహిస్తూ స్టూడెంట్లలో మార్పు తీసుకొస్తున్నారు .

రాజీలేని పది సూత్రాలు ఇవే..

 1. ఎన్ని పనులున్నా ప్రతి రోజు సూర్యోదయానికి ముందే అమ్మానాన్నలు లేపకున్నా నిద్రలేస్తాను.
 2. నా సామర్థ్యాన్ని నిరంతరం తెలుసుకుంటూ దానిని మరింత పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తుంటాను.
 1. శారీరక పరిశుభ్రత కోసం ప్రతి రోజూ స్నానం చేస్తాను.
 2. ఎన్ని పనులున్నా ఏ రోజు పాఠాలను ఆ రోజే చదువుకుంటాను.
 3. నా లక్ష్య సాధన కోసం100 శాతం ప్రయత్నిస్తాను.
 4. ఫలితం కోసం ఎదురుచూడను. బాధ పడను. గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తాను.
 5. లక్ష పనులున్నా ప్రతి రోజూ వేళకు బడికి వెళ్తాను.
 6. నా భవిష్యత్‌‌ను నిర్మించుకోవడం.. నా బాధ్యత అని నమ్మి దాని కోసం శ్రమిస్తాను.
 7. నేను చదువుతోపాటు ఆటలు, పాటలు, కళలు, మొదలైన వాటిలో పురోగమించడానికి కృషి చేస్తాను.
 1. తోటి వారితో కలిసి మెలిసి ఉండడం ద్వారా నేను అభివృద్ధి చెందుతాను. ఇతరుల అభివృద్ధికి తోడ్పడతాను.

  see also: బీజేపీ ఓట్లు పెరిగాయ్​

  నిజాం టిఫిన్ బాక్స్ కొట్టేసింది వీరే..

  దిష్టి బొమ్మలుగా మారిన ముద్దుగుమ్మలు

Latest Updates