స్టూడెంట్స్ టైం టేబుల్: ప్రతి నిమిషం ఇంపార్టెంటే!

షెడ్యూల్‍ సెట్ చేసుకుంటే మెరిట్ పక్కా
టైం మేనేజ్ ఎగ్జామ్ సక్సెస్
ఫోన్, టీవీల నుంచి డైవర్ట్ అయితేనే బెటర్
రోజుకు తగినంత నిద్ర కంపల్సరీ

ఎగ్జామ్‍ సీజన్‍! ప్రతి నిమిషం ఇంపార్టెంటే! ఇప్పుడు ఒక్క నిమిషం వేస్ట్ చేసినా అది ఎగ్జామ్‍ ఫలితంపై ప్రభావం చూపుతుంది! అందుకే ఇప్పుడున్న టైం ని చక్కగా ప్లాన్‍ చేసుకుంటే ఎగ్జామ్‍లో బెటర్ రిజల్ట్ సాధించొచ్చు!

ఎగ్జామ్ టాప్‍ పొజిషన్ నిలిస్తే మీతోపాటు మీ పేరెంట్స్, టీచర్లు పడే ఆనందాన్ని ఒక్కసారి ఊహించుకోండి. చాలా ఆనందం కలగడంతో పాటు మీకు మీరు ఎగ్జామ్‍ యుద్ధంలో గెలిచిన వీరుడిలా కనిపించడం ఖాయమంటున్నారు నిపుణులు. టైం మేనేజ్ మెంట్‍ పక్కాగా ఉంటే ఎగ్జామ్ సగం విజయం సాధించినట్లేనని ఎడ్యుకేషనల్‍ సైకాలజిస్టులు చెప్తున్నారు. ఇంటర్‍ ఎగ్జా మ్ ఇంకా రెండు వారాలే టైం ఉంది. టెన్త్ ఎగ్జామ్ కు ఇంకా నెల రోజుల టైం ఉంది. ఆ తర్వాత వచ్చే ఎంట్రెన్స్ ఎగ్జామ్ లు కూడా ఇంపార్టెంటే కదా. అందుకే ఇప్పటినుంచే మనకున్న సమయాన్ని సక్రమంగా చక్కబెట్టు కోకపోతే సమయం వృధా అవడంతోపాటు చివరికి ఎగ్జా మ్‍ హాల్లో హడావుడి, హైరానా పడాలి. అందుకే స్టూడెంట్స్ టైం మేనేజ్ మెంట్‍ సెట్ చేసుకొని చదివితే సక్సెస్ మీదేనంటున్నరు నిపుణులు.

టైమ్‍ కిల్‍ అంశాలకు దూరంగా…

ముందుగా మిమ్మల్ని పక్కదారి పట్టించడంతో పాటు మీ విలువైన సమయాన్ని కిల్‍ చేసే అంశాలకు దూరంగా ఉండాలి. మీకున్న విలువైన టైంని వేస్ట్ చేసే సెల్ న్‍, టీవీలు, మూవీస్ లకు దూరంగా ఉండేలా ప్లాన్‍ చేసుకోవాలి. మీకున్న టైం ప్రకారం రోజుని ప్లాన్‍ చేసుకో వడం ద్వారా మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఎలాంటి ఫలితాన్నివ్వని వాటికి, మీ చదువులకు ఉపయోగంలేని అంశాలు, ఎగ్జా మ్‍ ప్రిపరేషన్ కు అసలు ఉపయోగపడని వాటికి ప్రాధాన్యమివ్వకుం టేనే మంచిది. ముందుగా అనుకున్నట్ లు గానే ప్లాన్ ప్రకారం సిలబస్ ను చదివేయండి. రేపు, మాపు అంటూ వాయిదాలు వేయొద్దు. దీని కారణంగా మైండ్‍ లేజీనెస్ కు అలవాటు పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అనువైన టైంలో రివిజన్…

పొద్దున 4 గంటలకు లేచి చదివితే మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది.. చదివిందంతా బుర్రకెక్కుతదని అందరూ చెప్తుంటారు. అది వాస్తవమే అయినా కొందరికి రాత్రి చదివితే బాగా గుర్తుంటది. కాబట్టి మీకు ఏ టైం అనువుగా ఉంటే ఆ టైంలో మీరు చదువుకునేందుకు టైం ఫిక్స్ చేసుకో వాలి. ప్రతి రెండు గంటలకు 15 నిమిషాలు బ్రేక్‍ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది మైండ్‍ రిఫ్రెష్ కు ఉపయోగడుతుంది.

ప్రతి నిమిషం విలువైంది

ఎగ్జామ్‍ ప్రిపరే షన్ లో టైం మేనేజ్ మెంటే చాలా కీలకం. ప్రతి నిమిషాన్ని యూస్ చేసుకునేలా ప్లాన్‍ చేసుకోవాలి. ఇంటర్ ఎగ్జామ్స్​కు ఇంకా రెండు వారాలే టైం ఉంది. క్లిష్టమైన సబ్జెక్టులకు అధిక టైం కేటాయించాలి. స్టడీ అవర్స్ మధ్యలో బ్రేక్‍ తప్పనిసరిగా తీసుకోవాలి.

– భావన తిరుమల, ఎడ్యుకేషనల్‍ కౌన్సెలర్‍

see also: కులం పేరుతో దూషించారని ఆత్మహత్య

see also: కనికరంలేని తల్లి: కొడుకుని చంపింది

Latest Updates