కుల సంఘాల ప్రచారం : వేరే వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవద్దని విద్యార్థులచే ప్రతిజ్ఞ

మిజోరాం : కుల, మతాలు విడనాడాలని మానవ హక్కులపై అవగాహన కల్పిస్తున్నా కొన్నిచోట్ల మార్పు రావడంలేదు. తమ పిల్లలు తమ కులాల వారినే పెళ్లి చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. మరీ కులగజ్జి ఉన్నవారయితే స్కూల్ పిల్లలతో చిన్నప్పట్నుంచే కులం గురించి చెప్పి అంటు పెడుతున్నారు. చదువుకునే రోజుల్లో ఎక్కువగా ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటున్నారని..ఒకవేళ ప్రేమిస్తే తమ కులానికి చెందిన వారినే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చెబుతున్నారు. చక్కగా చదువుకుని పైకి రావాలని చెప్పకుండా.. ఇలా కులం పేరుతో చిన్నప్పుడే విద్యార్థులను చెడగొడుతున్నారు. ఇటీవల మిజోరాంలో జరిగిన ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మిజోరాం రాష్ట్రంలోని మిజో గిరిజన తెగకు చెందిన కొందరు నాయకులు జోరుగా కుల ప్రచారం చేస్తున్నారు. మిజో గిరిజన పిల్లలు తమ కులం వ్యక్తుల్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలని మిజో జిర్ లాయి పాల్ అనే విద్యార్థి సంఘం ప్రచారం చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు స్కూల్స్ స్టూడెంట్స్ తో ప్రామిస్ చేయించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ప్రశ్నించగా.. తాము ఎవరినీ బలవంతం చేయట్లేదని..విద్యార్థులకు సూచనలు మాత్రమే చేస్తున్నామని విద్యార్థి సంఘాల నాయకులు చెప్పారు. ఇలాంటివారిని అసలు స్కూల్స్ లోకి ఎలా అనుమతినిస్తారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ న్యూస్ వైరల్ కాగా..ఇందుకు సంబంధించిన ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.

 

Latest Updates