ఇంటర్ లో టాపర్లు ఎంసెట్​లో క్వాలిఫై కాలే

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్​లో టాపర్లుగా నిలిచిన స్టూడెంట్స్​, ఎంసెట్ ఎగ్జామ్​లో కనీసం క్వాలిఫై కూడా కావడం లేదు. ఇలాంటి వారు ఐదుగురో, పదిమందో కాదు.. ఆ సంఖ్య  ఏకంగా వేలల్లోనే ఉంటున్నది. ఈ ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం మొత్తం 1,43,326 మంది అప్లయ్​ చేసుకోగా.. 1,19,183 మంది పరీక్షకు హాజరయ్యారు. దీంట్లో 89,734 (75.29శాతం) మంది క్వాలిఫై అయ్యారు.160 మార్కుల కోసం జరిగే ఈ పరీక్షలో 121 నుంచి 160 మార్కులు సాధించిన స్టూడెంట్స్​ కేవలం 117 మంది ఉన్నారు. 81–120 మార్కులు వచ్చిన వారు 3,409 మంది ఉండగా, 40–80 మార్కులు స్కోర్ చేసిన వారు 79,201 మంది ఉన్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, ఇంటర్మీడియెట్​లో కాలేజీ టాపర్లుగా నిలిచిన స్టూడెంట్స్​చాలామంది ఎంసెట్​ ఎగ్జామ్​లో క్వాలిఫై కాలేకపోయారు. ఇంటర్​లో వెయ్యి మార్కులకు గానూ 900 మార్కులు ఆపై స్కోర్ చేసిన స్టూడెంట్స్​సుమారు 5,300 మంది వరకూ కనీసం ఎంసెట్​లో అర్హత మార్కులు 40 ( 25శాతం) కూడా సాధించలేకపోయారు. మొత్తం సగానికి పైగా(80 మార్కులు) మార్కులొచ్చింది 3,526 మంది స్టూడెంట్స్​ మాత్రమే.

గతేడాది కూడా అంతే…

ఎంసెట్​(ఇంజనీరింగ్​ స్ట్రీమ్​) 2019లో  91,446 మందికి ర్యాంకులు కేటాయించారు. వీరిలో ఎంసెట్​లో 121 నుంచి 160 మార్కులు సాధించిన స్టూడెంట్స్​ 45 మంది మాత్రమే ఉన్నారు. 80 మార్కులు అంటే సగం మార్కులు సాధించిన వారు 4,343 మందే ఉన్నారు. ఎంసెట్ లో క్వాలిఫై అయ్యే స్టూడెంట్స్ అంతా ఇంటర్ లో 80 % మార్కులు సాధించినవారే ఉంటారని ఆఫీసర్లు చెప్తున్నారు. కానీ 90% మార్కులొచ్చిన స్టూడెంట్స్​ఎంసెట్​లో 25% మార్కులూ సాధించలేకపోవడం విద్యాప్రమాణాలపై అందరిలో అయోమయం నెలకొన్నది.

సరైన శిక్షణ లేకనే సమస్య

గ్రామీణ ప్రాంత స్టూడెంట్లకు ఎంసెట్ శిక్షణ, మెటిరియల్​ అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అర్బన్ ఏరియాల్లో కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల్లో పైపైన ఇంటర్ చదువులకు ప్రాధ్యానం ఇచ్చి, మొత్తం ఎంసెట్ పై దృష్టి సారించడంతో ఆ కాలేజీల్లోంచి ఎక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు. ఈ వ్యత్యాసం తొలగించేందుకు సర్కారు కాలేజీల్లో కోచింగ్ ఇవ్వాలని 2008 ప్రొఫెసర్ దయారత్నం కమిటీ సూచించినా, ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోలేదు. కార్పొరేట్ కాలేజీల్లో బట్టీ విధానమూ ఎంసెట్​లో ర్యాంకులు రాకపోవడానికి కారణం.

– మధుసూధన్​రెడ్డి, ఇంటర్ జేఏసీ చైర్మన్

Latest Updates