తండ్రి చనిపోయిన బాధతోనే టెన్త్​ పరీక్షకు..!

ఇబ్రహీంపట్నం/ఆత్మకూర్/దేవరకద్ర, ​వెలుగు: ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉండి నడిపించిన నాన్న ఇక లేడన్న విషయం తెలిసినా పుట్టెడు దుఃఖంలోను పరీక్షకు హాజరయ్యారా స్టూడెంట్లు. పరీక్ష తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్​కొత్తూర్ కు చెందిన చల్ల లక్ష్మి–- నర్సయ్యల కుమార్తె త్రిష. ఇబ్రహీంపట్నం మోడల్​స్కూల్​లో టెన్త్​చదువుతోంది. బుధవారం అర్ధరాత్రి నర్సయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. ఆ బాధను దిగమింగి త్రిష గురువారం పదో తరగతి పరీక్షకు హాజరైంది.

నారాయణపేట జిల్లా ఆత్మకూర్​కు చెందిన మున్నూరు హన్మంత్​ రెడ్డి(48) బుధవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురై చనిపోయాడు. ఆయన కూతురు అఖిల టెన్త్​ పరీక్షలకు హాజరైన తర్వాత అంత్యక్రియల్లో పాల్గొంది. మహబూబ్​నగర్ ​జిల్లా దేవరకద్రకు చెందిన  రవి తండ్రి వెంకటేశ్వర్లు కొన్నిరోజులుగా అనారోగ్యంతో  బాధపడుతున్నాడు. కర్నూల్ ఆసుపత్రికి బుధవారం మృతిచెందాడు. రవి టెన్త్​ పరీక్ష రాసొచ్చిన తర్వాత స్వగ్రామంలో అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.- –

అన్న చనిపోయిండు

గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం బుడుమర్సు గ్రామంలోని భరత్ పీజీ చేస్తున్నాడు. అనారోగ్యంతో నిమ్స్​లో బుధవారం రాత్రి చనిపోయాడు. భరత్ చెల్లి సంపూర్ణ ఆ బాధతోనే పరీక్ష రాసి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొంది.

మరిన్ని వార్తలు

కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది

Latest Updates