సెలబ్రిటీల పేరుతో ఉన్న ఫేక్ గ్రూప్స్ డిలీట్ చేయాలి

హైదరాబాద్ : ఫేస్ బుక్ లో సెలెబ్రిటీల పేర్లతో గ్రూప్స్ క్రియేట్ చేయడం కామన్. అలా.. గ్రూప్స్, పేజీలు పెట్టి.. లక్షలు, మిలియన్లలో ఫాలోయర్స్ పెంచేవాళ్లు ఎందరో ఉన్నారు. ఐతే… సెలబ్రిటీల పేరుతో గ్రూప్స్  క్రియేట్ చేసి అందులో అశ్లీల వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్టుమెంట్ కు ఓ కంప్లయింట్ అందింది.

సోషల్ మీడియాలో.. సెలబ్రిటీల పేరుతో గ్రూప్ లలో అశ్లీల వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీసీఎస్ సైబర్ క్రైమ్స్ లో ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ నాయకులు ఫిర్యాదు చేశారు. యాంకర్ అనసూయ భరద్వాజ్ ఫ్యాన్స్ పేరుతో గ్రూప్ క్రియేట్ చేసి.. అశ్లీల వీడియోలు పెడుతూ… చెడు మార్గాల వైపు యూత్ ను మళ్లిస్తున్నారని… ఇలాంటి  గ్రూప్ అడ్మిన్ లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు విద్యార్థి నాయకులు.

Latest Updates