హాంకాంగ్‌లో 19 లక్షల మందికి ఒత్తిడి

  • 5.90 లక్షల మందికి డిప్రెషన్
  • గత ఏడాది జరిగిన అల్లర్లే కారణమంటున్న రీసెర్చర్లు

రోడ్డుపై పోతుంటే.. సడెన్ గా మన మీద రాళ్లు రివ్వున దూసుకొచ్చి పడ్తయి. పోలీసులు వెంటపడి తరుముకొస్తరు. ఏవైపు నుంచి రబ్బర్ బుల్లెట్లు దూసుకొస్తయో తెలవదు. ఎప్పుడు టియర్ గ్యాస్ తో ఉక్కిరి బిక్కిరి అయిపోతామో అర్థం కాదు. అయినా సరే.. ఎక్కడో ఓ చోట పోలీసులు పట్టుకుని, జైలుకు లాక్కెళ్తుంటరు… ఇప్పుడు హాంకాంగ్ లో మూడొంతుల మంది పెద్దవాళ్ల (అడల్ట్స్)కు ఇసొంటి పీడకలలే వస్తున్నయట! లక్షలాది మంది మానసిక వ్యాధులతో కుంగిపోతుండగా, చాలా మంది డిప్రెషన్ లో కూరుకుపోయారట! గత ఏడాది హాంకాంగ్ లో కొనసాగిన అల్లర్ల వల్లే ఆ సిటీలో చాలామంది జనం ఇలా మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఈ మేరకు ఓ రీసెర్చ్ లో తేలింది.

మూడొంతుల మంది బాధితులే.. 

హాంకాంగ్ జనాభా 75 లక్షలు. వీరిలో 63 లక్షల మంది పెద్ద వాళ్లు (అడల్ట్స్) ఉన్నారు. ఇందులో19 లక్షల మంది అడల్ట్స్ ఇప్పుడు పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్ డీ) బారిన పడ్డారని, మరో 5.90 లక్షల మంది డిప్రెషన్ లో కూరుకుపోయారని యూనివర్సిటీ ఆఫ్​హాంకాంగ్ రీసెర్చ్ లో వెల్లడైంది. హాంకాంగ్ లో ప్రజల మానసిక ఆరోగ్యంపై రీసెర్చ్ లో భాగంగా యూనివర్సిటీ ఆఫ్​హాంకాంగ్ రీసెర్చర్లు18 వేల మందిపై 2009 నుంచి 2019 మధ్యలో అధ్యయనం నిర్వహించారు. సామాజిక అల్లర్లు, అశాంతి పరిస్థితులు ప్రజల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న కోణంలో రీసెర్చ్ చేశారు. దీంతో గత ఏడాది జూన్ లో హాంకాంగ్‌‌లో ఖైదీల ఎక్స్ ట్రాడిషన్ బిల్లుకు వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లు, హింసాత్మక సంఘటనల తర్వాత సిటీలోని పెద్దవారిలో దాదాపు 32% మంది పీటీఎస్‌‌డీ బారిన పడ్డారని తేలింది.

సోషల్ పీస్, మెంటల్ హెల్త్ కు లింకు 

హింసాత్మక, భయంకరమైన సంఘటనలను చూసిన తర్వాత తీవ్ర ఆందోళనకు గురవడం, పీడకలలు రావడం, నిద్ర పట్టకపోవడం, టెన్షన్ వంటి మానసిక సమస్యలు వస్తాయని, ఇలాంటి పరిస్థితినే పీటీఎస్డీ అంటారని రీసెర్చర్లు తెలిపారు. హాంకాంగ్ అల్లర్లలో 7 వేల మంది అరెస్ట్ అయ్యారు. 1600 రౌండ్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఎంతో మందికి రాళ్లు, లాఠీల దెబ్బలు తగిలాయి. ఇద్దరు ఆందోళనకారులు పోలీసుల తూటాలకు బలయ్యారు. మరొకరు మంటల్లో సజీవ దహనం అయిపోయారు. మొత్తంగా ఈ భయంకరమైన అనుభవాల నేపథ్యంలో లక్షలాది మంది మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదని, సామాజిక శాంతికి, మెంటల్ హెల్త్ కు లింకు ఉన్నట్లు తేలిందని రీసెర్చర్లు పేర్కొన్నారు. 2009తో పోలిస్తే 2019లో పీటీఎస్డీ 6 రెట్లు ఎక్కువగా నమోదైందని చెప్పారు. అయితే, 18 ఏళ్లలోపు వాళ్లను తాము స్టడీ చేయలేదని, వారిలో ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు.

Latest Updates