స్టెంట్స్ ధరలు పెరిగాయి

కార్డియాక్ స్టెంట్స్‌‌ ధరలను 4.2 శాతం పెంచే ప్రతిపాదనను నేషనల్‌ ఫార్మాస్యూ టికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌ పీపీఏ) ఆమోదించింది. అంతకు ముందు కేలండర్‌ సంవత్సరంలోని హోల్‌ సే ల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌‌ (డబ్ల్ యూపీఐ)ఆధారంగా ఈ పెం పుదలను నిర్ణయించినట్లు ఎన్‌ పీపీఏ వెల్లడించింది. ఎన్‌ పీపీఏ ప్రకటించిన కొత్త ధరల ప్రకారం బేర్‌ మెటల్‌ స్టెంట్‌ (బీఎంఎస్‌ ) ధర రూ.8,261, డ్రగ్‌ ఎలూటింగ్‌ స్టెంట్‌ (డీఈఎస్‌ ) ధర రూ. 30,080 .ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని ఎన్‌ పీపీఏ పేర్కొంది. అంతకు ముందు ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి ఎన్‌ పీపీఏ స్టెంట్స్‌‌ ధరలను సవరించింది. బేర్‌ మెటల్‌ స్టెంట్స్‌‌ ధరను రూ.7,440 నుంచి రూ. 7,660 కి పెం చిన ఎన్‌ పీపీఏ, డీఈఎస్‌ స్టెంట్స్‌‌ ధరలను మాత్రం రూ. 30,180 నుంచి రూ. 27,980 కి తగ్గించింది.దేశంలోని లక్షలాది మంది హృద్రోగులకు ఆనందం కలిగించేలా, మొదటిసారి స్టెంట్స్‌‌ ధరలను ఫిబ్రవరి, 2017 లో గణనీయంగా ఎన్‌ పీపీఏ తక్కువ చేసింది. ప్రాణాలను కాపాడే కొరొనరీ స్టెంట్స్ ధరలను అప్పట్లో ఎన్‌ పీపీఏ ఏకంగా 85 శాతం తగ్గిం చడం గమనార్హం. అంతకు ముందు బీఎంఎస్‌ రూ. 45,000, డీఈఎస్‌ రూ.1.21 లక్షలుగా ఉండేవి. దాం తో వాటి ధరలను సమీక్షించి,సీలిం గ్‌ ధరలను ఎన్‌ పీపీఏ నిర్ణయించిం ది. డ్రగ్స్‌‌ ప్రైస్‌ కంట్రోల్‌ ఆర్డర్‌ (డీపీసీఓ)లోని 871 ఫార్ములేషన్స్‌‌ రిటైల్‌ ధరలను కూడా సవరించినట్లు ఎన్ పీపీఏ ప్రకటించింది.

 

Latest Updates