రూ.80వేలు లంచం తీసుకుంటూ ఎస్సై అరెస్ట్

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై నర్సింహులు ఏసీబీ అధికారులకు దొరికాడు. రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ప్రాపర్టీ రికవరీ విషయంలో ఎస్సై దగ్గరకు వెళ్తే రూ.80 వేలు అడిగాడని ఏసీబీని కలిసి ఫిర్యాదుచేశారు బాధితులు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించారు. మహేశ్వరం పీఎస్ లో రూ.80వేల లంచం తీసుకుంటుండగా… రెడ్ హాండెడ్ గా ఎస్సైని ఏసీబీ ఆయన్ను పట్టుకుంది.

2002 బ్యాచ్ కు చెందిన ఎస్సై నర్సింహులు..జవహర్ నగర్ స్టేషన్ లో విధులు నిర్వర్తించే సమయంలో ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 2017లో అతనిపై పోలీస్ శాఖ ఓసారి చర్యలు తీసుకుంది.

Latest Updates